Thandel First Single: అక్కినేని నాగచైతన్య.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడు. అందులో భాగంగానే చై నటిస్తున్న చిత్రం తండేల్. కార్తీకేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి హిట్ అందుకున్న చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో చై సరసన బాక్సాఫీస్ క్వీన్ సాయిపల్లవి నటిస్తోంది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే లవ్ స్టోరీ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. దీంతో తండేల్పై కూడా ఫ్యాన్స్ చాలా అంచనాలను పెట్టుకున్నారు. శ్రీకాకుళం మత్స్యకారుల జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ రానున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. బుజ్జితల్లి అంటూ సాగే మొదటి పాటను ఈ నవంబర్ లోనే రిలీజ్ చేస్తున్నట్లు తెలుపుతూ ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో సాయిపల్లవి బిగి కౌగిలిలో నాగచైతన్య బందీ అయ్యి కనిపించాడు.
కేవలం సాయిపల్లవి ముఖం మాత్రం కనిపించింది. ప్రేమికుడును చూసిన ఆనందం ఆమె ఫేస్ లో కనిపిస్తుంది. ఇక ఇప్పటికే బుజ్జితల్లే.. వచ్చేస్తున్నా కదే.. కూసింత నవ్వరాదే అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికి తెల్సిందే. ఇక ఈ సాంగ్ కూడా బుజ్జితల్లి గురించే అని అర్ధం అవుతుంది. పోస్టర్ లో సాయిపల్లవి సిగ్గుపడుతూ ఎంతో అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.
Unstoppable With NBK: ఒక్కసారైనా ఎన్టీఆర్ గురించి అడగాలనిపించలేదా బాలయ్య.. ?
ఇక అందులోనూ ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. దేవి.. లవ్ సాంగ్స్ పర్ఫెక్ట్ కాంబో అని చెప్పాలి. ఈమధ్య దేవి హవా కొంతవరకు తగ్గింది అన్న విషయం అందరికీ తెల్సిందే. ఈరోజు రిలీజ్ అయిన కుబేర గ్లింప్స్ చూసాకా.. దేవిశ్రీ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడని అనిపిస్తుంది. దీంతో తండేల్ పై కూడా అంచనాలను పెంచేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ కానుంది.. దేవి మ్యాజిక్ ను మళ్లీ తీసుకురానుందా.. ? అనేది చూడాలి.