Unstoppable With NBK: అన్ స్టాపబుల్ విత్ NBK.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న షో. అంతలా షేక్ చేసేలా ఎవరు వచ్చారు అంటే .. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బాలయ్య, అల్లు అర్జున్ కలిస్తే.. ఆ హంగామా ఎలా ఉంటుందో మూడేళ్ళ క్రితం పుష్ప సమయంలో చూసాము. ఇక ఇప్పుడు ఆ హంగామా మళ్లీ రీపీట్ అయ్యింది. ఎపిసోడ్ మొత్తం నవ్వకుండా చూడడం చాలా కష్టమనే చెప్పాలి. ఆహాలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది.
బాలయ్య.. బన్నీతో ఆడించిన గేమ్స్, సంధించిన ప్రశ్నలు.. ఎలాంటి కాంట్రవర్సీ కాకుండా బన్నీ ఇచ్చిన సమాధానాలు అదిరిపోయాయి. అయితే ఏ షో అయినా.. ఒక స్టార్ సెలబ్రిటీ వచ్చాడంటే.. ఇండస్ట్రీలో ఉన్న మిగతా హీరోల గురించి ఒపీనియన్ అడుగుతారు. ఈ షోలో కూడా అదే జరిగింది. అల్లు అర్జున్ రావడంతో.. బన్నీ ఆయన కుటుంబం గురించి, సినిమాల గురించి, స్నేహితుల గురించి మాట్లాడాడు. ఇండస్ట్రీలో బన్నీ క్లోజ్ గా ఉండే అందరి గురించి బాలయ్య అడిగాడు. ఒక్క ఎన్టీఆర్ గురించి తప్ప.
Satya Dev: ప్రమోషన్స్ కోసం ఇంత దిగజారాలా బ్రహ్మాజీ..ఇవే ప్రశ్నలు మీడియా అడిగితే.. ?
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్.. ఇలా అందరి పేర్లు తీసుకొచ్చి.. వాళ్ళతో నీ అనుబంధం ఏంటి అని అడిగారు. బన్నీ సైతం.. వారి గురించి ఎంతో అద్భుతంగా చెప్పుకొచ్చాడు. కానీ, ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ ఒక్క మాట కూడా అడగలేదు. బన్నీకి , ఎన్టీఆర్ కి మధ్య అనుబంధం గురించి ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. బావ.. బావా అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. అలాంటి బంధం గురించి ఈ షోలో ఎవరు మాట్లాడాడలేదు. బాలయ్యకు – ఎన్టీఆర్ కు మధ్య విభేదాలు ఉన్నాయని ఎప్పటినుంచో టాక్.
ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కానీ, వేరే ఇతర ఈవెంట్స్ లో కానీ.. ఎప్పుడు బాలయ్య.. ఎన్టీఆర్ పేరు కూడా తీసుకురాలేదు. కనీసం ఈ షో లో అయినా తీసుకు వస్తారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేశారు. కనీసం.. బన్నీ అయినా తన స్నేహితుడు ఎన్టీఆర్ గురించి ఎక్కడైనా చెప్తాడేమో అని ఆశించాడు. ఈ రెండు కూడా ఈ షోలో జరగలేదు.
ఇక ప్రతి హీరో గురించి బన్నీ చెప్పిన మాటలను కట్ చేసి వారి అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేసుకుంటున్నారు. ఆ వీడియోలను పోస్ట్ చేస్తూ.. ఎన్టీఆర్ పేరు ఒక్కసారైనా వినిపిస్తుందేమో అని ఈ షోని ఆయన కోసం నాలుగుసార్లు చూసా.. కానీ, ఒక్కసారిగా కూడా వినిపించలేదు. అందరూ వారి వారి హీరోల వీడియోలు పెట్టుకుంటున్నారు. మాకు ఆ అదృష్టం లేదు అని, ఒక్కసారైనా ఎన్టీఆర్ గురించి అడగాలనిపించలేదా బాలయ్య.. అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.