E-Paper
Advertisement

Thandel Day 4 Collections: దుమ్ము దులిపేస్తున్న ‘తండేల్ ‘ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?

Thandel Day 4 Collections: దుమ్ము దులిపేస్తున్న ‘తండేల్ ‘ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?

Thandel Day 4 Collections:  అక్కినేని హీరో నాగచైతన్య, న్యాచురల్ బ్యూటి సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం తండేల్.. కార్తికేయ 2 ఫేమ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకం పై బన్నీ వాసు నిర్మించారు. రియల్ స్టోరీ బేస్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజు మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ రెండు రోజు మంచి టాక్ ను అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. మూడు రోజుల్లో మంచి కలెక్షన్స్ను వసూల్ చేసిన ఈ తండేల్ మూవీ, నాల్గొవ రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో ఒకసారి తెలుసుకుందాం..

ఈ మధ్య నాగ చైతన్య ఖాతాలో ఒక్క హిట్ మూవీ పడటలేదు. సరైన హిట్ లేక సతమతవుతున్న నాగ చైతన్య.. సక్సెస్ పుల్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీలో నటించారు. ఈ మూవీ భారీ బడ్జెడ్ తో తెరకేక్కడంతో భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి.. రియల్ స్టోరీ ఆధారంగా రూపొందిన ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీ సాంగ్స్ బాగా హైలెట్ అయ్యాయని చెప్పాలి. మొన్న పుష్ప 2 మూవీతో మంచి హిట్ ను అందుకున్న దేవీకి ఈ మూవీ మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ ఉత్తరాంధ్రలోని జాలర్ల జీవితంలో జరిగిన యదార్థ గాథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా సముద్రం, పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్‌తో కథ కొనసాగుతుంది.. కథ కాస్త కొత్తగా ఉండడంతో ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. మొదటి రోజు 20 కోట్లకుపైగా వచ్చినా కూడా వీకెండ్ కావడంతో రెండు మూడు రోజులు బాగా పెరిగినట్లు తెలుస్తున్నాయి. రెండో రోజు 30 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన తండేల్ మూవీ తండేల్ మూవీ మూడో రోజు బాగానే వసూలు చేసింది. 41.2 కోట్ల గ్రాస్ ను రాబట్టిన ఈ మూవీ నాల్గోవ రోజు ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

నాలుగు రోజుల కలెక్షన్స్ విషయానికొస్తే.. ఈ సినిమాను సుమారు 1500 స్క్రీన్ల లో రిలీజ్ చేశారు.. ఈ మూవీ మొదటి రోజు ఊహించని విధంగా 21 కోట్లను వసూల్ చేసింది.. రెండో రోజు కూడా తండేల్‌ అదే జోరును కొనసాగించింది. రెండో రోజు దగ్గర దగ్గర రూ.20 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో తండేల్ మూవీ 2 రోజుల్లో రూ.41.20కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.. ఇక మూడో రోజు కూడా కలెక్షన్స్ భారీగానే వచ్చినట్లు తెలుస్తుంది. ఏపీ, నైజాం లో రూ. 9 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌ లో రూ. 2.5 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ. 2.5 కోట్ల గ్రాస్ తో వర్డల్ వైడ్ గా డే 3 నాడు దాదాపు రూ. 14 కోట్ల వరకూ వసూళ్లు నమోదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో తండేల్ మూవీ రూ.50 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది.. ఇక నాలుగు రోజులకు రూ. 62 కోట్ల గ్రాస్ ను వసూల్ రాబట్టింది. ప్రస్తుతం రూ. 80 కోట్లకు పై కలెక్షన్స్ ను అందుకుంది.ఇదే జోరును కొనసాగిస్తే మరో రెండు రోజుల్లోనే సినిమాకు పెట్టిన బడ్జెట్ ను వసూల్ చేస్తుంది.. ఇదే విధంగా కలెక్షన్స్ వస్తే మాత్రం కొద్ది రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరడం పక్కా అని వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×