తెలుగు ఇళ్లల్లో ప్రధాన భోజనంలో పెరుగు కచ్చితంగా ఉండాల్సిందే. అలాగే పాలు కూడా ప్రతిరోజూ తాగే వారి సంఖ్య ఎక్కువే. ఉదయాన్నే పాలతోనే తమ రోజును మొదలుపెట్టే వారు కూడా ఉన్నారు. ఇలా పాలును ఎప్పుడు పడితే అప్పుడు తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఖాళీ పొట్టతో పాలు పెరుగు వంటివి తీసుకోవచ్చా వంటి ప్రశ్నలకు పోషకాహార నిపుణులు వివరణ ఇస్తున్నారు.
నిజానికి ఖాళీ పొట్టతో పాలు, పెరుగు వంటివి తీసుకోకూడదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలా తినడం వల్ల ఉబ్బరం, ఎసిడిటీ లేదా కడుపునొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పాల ఉత్పత్తుల్లో సహజంగానే లాక్టిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది కడుపులో ఎసిడిటీని సృష్టిస్తుంది. దీని కారణంగా గ్యాస్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. పెరుగులో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఒక్కొక్కసారి ఆరోగ్యానికి మేలే చేస్తుంది. అయితే కొంతమందిలో మాత్రం ఇది ఎసిడిటీకి కారణం అవ్వచ్చు. పెరుగు ఖాళీ పొట్టతో తిన్నా పర్వాలేదు గానీ పాలు మాత్రం ఖాళీ పొట్టతో తాగడం మంచి పద్ధతి కాదు.
అల్పాహారంలో పెరుగు తినడం మంచిదని ఎంతోమంది భావిస్తారు. అది కొంతవరకు నిజమే. ఖాళీ పొట్టతో పెరుగు తినడం వల్ల అన్ని రకాలుగా మేలే జరుగుతుంది. ఎందుకంటే దీనిలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి .ఇవి నేరుగా పెద్ద పేగులోకి వెళతాయి. అక్కడ ఉండే మంచి బ్యాక్టీరియాను కాపాడతాయి. ముఖ్యంగా ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్య ఉన్నవారు ఖాళీ పొట్టతోనే పెరుగు తినడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
పెరుగును ఇలా తినాలి?
పెరుగును ఖాళీ పొట్టతో తినేటప్పుడు కడుపులో ఉండే ఆమ్లాలు కొన్ని మంచి బ్యాక్టీరియాను చంపే అవకాశం ఉంది. దీని వల్ల కూడా ప్రోబయాటిక్ ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖాళీ పొట్టతో కేవలం పెరుగును మాత్రమే కాకుండా… పెరుగులో ఓట్స్ వంటివి కలుపుకొని తినడం ఆరోగ్యానికి మంచి పద్ధతి.
కొంతమందికి ఖాళీ పొట్టతో పెరుగు తినడం వల్ల ఎసిడిటీ సమస్య ఎక్కువగా మారుతుంది. ముఖ్యంగా పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి యాసిడ్ రిఫ్లెక్స్ త్వరగా వస్తుంది. అలాగే ఊబకాయంతో బాధపడుతున్న వారికి కూడా యాసిడ్ రిఫ్లెక్స్ వెంటనే వచ్చే అవకాశం ఉంది. పెరుగులోని లాక్టిక్ ఆమ్లం ఖాలీ పొట్టలోకి చేరి అసౌకర్యానికి ఉబ్బరానికి కారణం అవుతుంది.
నిజానికి ఉదయం పూట పెరుగు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో ఉండే క్యాల్షియం ప్రోటీన్, విటమిన్ బి వంటివి శరీరానికి త్వరగా అందుతాయి. పెరుగులో ఎముకల ఆరోగ్యాన్ని, కండరాల మరమ్మత్తుకు సహాయపడే పోషకాలు కూడా ఎన్నో ఉంటాయి. కాబట్టి పెరుగును ఓట్స్ ను వేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగు ఖాళీ పొట్టతో తినడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. కానీ పాలను మాత్రం ఖాళీ పొట్టతో తీసుకోవడం ఎంత మంత్రం మంచిది కాదు.
Also Read: కొబ్బరి నీళ్లు తాగితే.. ఎన్ని ప్రయోజనాలుంటాయో తెలిస్తే, అస్సలు వదిలిపెట్టరు !
పెరుగులో నీటి శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. వేడి వాతావరణంలో శీతలీకరణ లక్షణాలు అందించడంలో పెరుగు ఉపయోగపడుతుంది. ఖీళీ పొట్టతో పెరుగు తినడం వల్ల శరీరానికి కొంతవరకు మంచే జరుగుతుంది.