OTT Movie : కొంతమంది సైకోలు చేసే అరాచకాలు చూస్తే ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది. సినిమాలలో ఈ సైకోలు చేసే హింస చూడాలంటే భయమేస్తుంది. నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సైకో థ్రిల్లర్ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో ఇద్దరూ గవర్నమెంట్ టీచర్లు, జనాభా లెక్కల కోసం ఒక పాడు పడ్డ ఇంటికి వెళ్లి ఇరుక్కుపోతారు. అక్కడ వీళ్ళు ఎదుర్కొనే భయంకరమైన సన్నివేశాలతో మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
రెండు ఓటీటీలలో
ఈ సైకో మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘వెల్కమ్ హోమ్’ (Welcome home). 2020లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా వెల్‌కమ్ హోమ్ అనే ఈ మూవీని చిత్రీకరించారు. ఇందులో కశ్మీరా ఇరానీ, స్వర్దా తీగలే, బోలోరామ్ దాస్, శశి భూషణ్, టీనా భాటియా నటించారు. ఈ మూవీకి పుష్కర్ మహాబల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ (Disney Plus hotstar), స్టార్ సోనీ లీవ్ (Sony LIV) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
అనూజ ఒక గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమెకు పెళ్లిచూపులు కూడా చూస్తూ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు. ఒకరోజు అనూష తన కొలీగ్ స్నేహతో కలిసి జనాభా లెక్కల కోసం పక్క విలేజ్ కి వెళుతుంది. అందరి ఇళ్ళు తిరిగి జనాభా లెక్కలు రాసుకుంటుంది. అయితే ఒక ఇల్లు ఊరికి దూరంగా ఉండటంతో, అక్కడికి ఇద్దరు కలిసి వెళతారు. ఆ ఇల్లు ఉన్న ప్రాంతం చుట్టూ నిర్మానుష్యంగా ఉంటుంది. ఆరోజు వర్షం పడటంతో వేరే దారి లేక వీళ్ళిద్దరూ అక్కడే ఉండాల్సి వస్తుంది. ఆ ఇంట్లో ప్రేరణ అనే గర్భవతి కూడా ఉంటుంది. వీళ్లు జనాభా లెక్కల గురించి అడుగుతుండగా, ఒక ముసలామె వచ్చి వివరాలు చెబుతుంది. ప్రేరణకి గన్ శ్యామ్ భర్తగా చెప్తుంది ఆ ముసలామె. వీళ్ళ ప్రవర్తన చాలా అనుమానంగా ఉంటుంది. ఆ ఇంట్లో ఒక పనివాడు కూడా ఉంటాడు. స్నేహతో ఆపని చేయాలని ఆతృతగా ఉంటాడు పనోడు.
అనూజ, స్నేహకు అక్కడ రాత్రిపూట కొన్ని శబ్దాలు వినపడతాయి. బయటికి వచ్చి చూస్తే, ఒక వ్యక్తిని బాగా కొట్టి గదిలో బంధించి ఉంటారు. వీళ్ళు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తారు. అక్కడున్న గన్ శ్యామ్, పనివాడు వీళ్లను కొట్టి బంధిస్తారు. అయితే నిజానికి ప్రేరణ గన్ షామ్ భార్య కాదు, ఆమె అతని కూతురు. కూతురిని గర్భవతిని చేసి, ఆమె తల్లిని చంపేసి ఉంటాడు గన్ షామ్. మరోవైపు ఈ టీచర్ల కోసం వచ్చిన వాళ్ళని కూడా చంపేస్తారు ఈ సైకో ఫ్యామిలీ. చివరికి వాళ్లు ఆ ఇంట్లో నుంచి తప్పించుకుంటారా? ఆ సైకోల చేతిలో బలవుతారు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘వెల్కమ్ హోమ్’ (Welcome home) అనే ఈ మూవీని చూడాల్సిందే.