Thandel Movie.. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో చివరిగా నాగచైతన్య (Naga Chaitanya) కస్టడీ సినిమా చేశారు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందించలేదు. దీంతో ఎలాగైనా సరే మంచి విజయం అందుకోవాలని తాపత్రయపడుతున్నారు. అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya). ఈ క్రమంలోనే హీరో నిఖిల్ (Hero Nikhil)తో కార్తికేయ -2 (Karthikeya -2) సినిమా చేసి పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న చందు మొండేటి (Chandu Mondeti)దర్శకత్వంలో తండేల్ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా వచ్చే యేడాదికి సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. కానీ తాజాగా ఈ సినిమా విడుదల వాయిదాకు కారణం అల్లు అరవింద్ (Allu Aravind) , నాగచైతన్య(Naga Chaitanya) అంటూ హాట్ బాంబ్ పేల్చారు డైరెక్టర్ చందు మొండేటి.
తండేల్ సినిమా వాయిదాకి వారే కారణం..
తాజాగా చందు మొండేటి ” రహస్యం ఇదం జగత్” అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా విచ్చేసి.. తండేల్ సినిమా విడుదల తేదీ పై మాట్లాడారు. చందు మొండేటి మాట్లాడుతూ.. నాగచైతన్య తండేల్ సినిమా విడుదల తేదీ గురించి మాట్లాడుతూ.. రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ (Game changer)సినిమా వస్తోందని అల్లు అరవింద్, వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం సినిమా వస్తోందని నాగచైతన్య ఇలా ఎవరికి వారు వెనక్కి తగ్గితే.. ఈ తండేల్ సినిమా సంక్రాంతికి రాదు.
లేకపోతే మేము ఈ సంక్రాంతికే విడుదల చేయాలని ప్లాన్ చేశాము అంటూ చందు మొండేటి తెలిపారు. ఇకపోతే సంక్రాంతికి విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. దీనికి తోడు సంక్రాంతి బరిలోకి దిగుతున్న వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం సినిమా అలాగే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలపై పెద్దగా బజ్ లేకపోవడం వల్లే అందరూ చందు మొండేటి చిత్రం తండేల్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పుడు అల్లు అరవింద్, ఇటు నాగచైతన్య వెనుకడుగు వేయడం వల్లే సినిమా వాయిదా పడుతోంది అంటూ అసలు నిజాన్ని బయటపెట్టారు డైరెక్టర్. ఇక చందు మొండేటి చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.
తండేల్ సినిమా విషయానికి వస్తే..
నాగచైతన్య హీరోగా , సాయి పల్లవి హీరోయిన్ గా మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం ఇది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో లవ్ స్టోరీ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో తండేల్ సినిమా రాబోతుంది అని తెలిసి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నాగచైతన్య కోస్తాంధ్ర కు చెందిన మత్స్యకారునిగా నటిస్తున్నారు. అతడిని ప్రేమించే అమ్మాయిగా సాయి పల్లవి నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి బన్నీ వాసు గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మాతగా.. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.