BigTV English

Balakrishna: మరోసారి తెరపైకి బాలయ్య ఉంగరం.. సక్సెస్ కి కారణం అదేనా..?

Balakrishna: మరోసారి తెరపైకి బాలయ్య ఉంగరం.. సక్సెస్ కి కారణం అదేనా..?

Balakrishna: సెలబ్రిటీలు చాలామంది కొన్ని రకాల సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. అలా సీనియర్ ఎన్టీఆర్ (Sr.NTR) నుండి ఇప్పటి జనరేషన్ హీరోల వరకు ఎంతో కొంత సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఉంటారు. అయితే తాజాగా ‘పద్మభూషణ్’ వచ్చిన వేళ బాలకృష్ణకు సంబంధించినటువంటి ఓ విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంతేకాదు బాలకృష్ణ (Balakrishna) సెంటిమెంట్ ప్రకారం.. వేలికి ఆ ఉంగరం ధరించడం వల్లే ఆయనకు ‘పద్మభూషణ్’ వచ్చింది అంటూ సోషల్ మీడియాలో కొత్త రచ్చ జరుగుతుంది. మరి ఇంతకీ బాలకృష్ణ ఫాలో అయ్యే ఆ సెంటిమెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. కొంతమంది హీరోలు తమ చేతి వేళ్లకు కొన్ని రకాల ఉంగరాలు ధరిస్తూ ఉంటారు.అలా కొంతమంది పచ్చ, ఎరుపు, పసుపు వంటి కలర్ లో ఉండే ఉంగరాలు ధరిస్తారు.ఇక మరికొంతమంది తాబేలు ఉంగరాన్ని పెట్టుకుంటారు.


బాలకృష్ణ అదృష్టానికి ఆ ఉంగరమే కారణమా..

ముఖ్యంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan), బాలకృష్ణ వంటి హీరోల చేతులకు ఈ ఉంగరాలు మనం చూసే ఉంటాం.అయితే బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చినప్పటినుండి ఇప్పటివరకు ఆయన చేతికి కొన్ని ఉంగరాలని మనం చూస్తూనే ఉన్నా. అయితే గత కొంతకాలం నుండి బాలకృష్ణ చేతికి పచ్చరత్నం ఉంగరం కనిపిస్తోంది. చాలా రోజుల నుండి ఆ ఉంగరాన్ని ఆయన తీయలేదట. అంతే కాదు బాలకృష్ణ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా సక్సెస్ అవ్వడానికి కారణం ఆ ఉంగరమే అంటూ కొత్త చర్చ జరుగుతుంది. అయితే బాలకృష్ణ(Balakrishna) వేళికి ఈ ఉంగరం ఉండడం వల్లే బాలకృష్ణకు అన్ని కోరికలు నెరవేరుతున్నాయి అని, ఆయనకి పద్మ భూషణ్ రావడానికి కూడా ఇదే కారణం అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కానీ బాలయ్య అభిమానులు మాత్రం ఈ కామెంట్లను కొట్టి పారేస్తున్నారు. బాలకృష్ణ సినీ ఇండస్ట్రీకి చేసిన విశిష్ట సేవకు, ఆయన నటనను మెచ్చి పద్మ భూషణ్ వస్తే.. మీరేమో ఉంగరం వల్ల వచ్చింది అని, ఆ ఉంగరానికి క్రెడిట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటూ దాన్ని కొట్టి పారేస్తున్నారు.


ఆ సెంటిమెంట్లను బాగా ఫాలో అవుతున్న బాలయ్య..

అయితే ఒక రకంగా చెప్పుకోవాలంటే నటనతో పాటు కూసింత అదృష్టం కూడా ఉండాలి. ఇక ఆ అదృష్టం రావడం కోసం ఎంతోమంది సెలబ్రిటీలు సెంటిమెంట్స్ ని ఫాలో అవుతూ ఉంటారు.అలా బాలకృష్ణ కూడా చాలా రకాల సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. అందులో ఒకటి ఆదివారం రోజు నలుపు రంగు దుస్తులు వేసుకోకపోవడం, మరొకటి తన చేతికి పచ్చ రత్నం ఉంగరం పెట్టుకోవడం. అయితే ఈ పచ్చరత్నం గల ఉంగరం ఎంతో మహిమ గలదని తెలుస్తోంది.ఈ ఉంగరాన్ని పెట్టుకుంటే ఎవరికైనా సరే అదృష్టం వరిస్తుందట. అందుకే చాలామంది వ్యాపారస్తులు, సినీ ఇండస్ట్రీలో ఉండేవాళ్లు ఈ పచ్చరత్నం ఉంగరాలను పెట్టుకుంటారని తెలుస్తోంది. అయితే బాలకృష్ణ (Balakrishna) తన బొటనవేలికి ఈ పచ్చరత్నం గల ఉంగరాన్ని ధరిస్తారు. ఈ ఉంగరానికి ఉన్న మహిమ కారణంగానే బాలకృష్ణ రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారని కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం బాలకృష్ణ(Balakrishna) చేతి వేలికి ఉన్న ఉంగరం గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×