Telangana Tourism: హుస్సేన్ సాగర్ పరిసరాలలో గల అన్ని పార్కులను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ను అభివృద్ధి చేసే అంశాన్ని టూరిజం శాఖ అధికారులు పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం పర్యాటకశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో టూరిజం పాలసీకి సంబంధించిన పలు అంశాలపై తీవ్ర చర్చ సాగింది.
సమీక్ష అనంతరం అధికారులతో సీఎం మాట్లాడుతూ.. ఫిబ్రవరి 10 లోగా టూరిజం పాలసీని సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. దేశ విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి, పాలసీని రూపొందించాలన్నారు. అలాగే విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా తెలంగాణ టూరిజం మరింత అభివృద్ధి చెందాలని సీఎం ఆకాంక్షించారు. ఎకో, టెంపుల్ టూరిజం పై ఎక్కువగా దృష్టి పెట్టాలని, సమ్మక్క సారలమ్మ జాతర జరిగే సమయంలో భక్తులు పర్యాటకులను ఆకర్షించేందుకు అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు.
జాతరతో పాటు సమీప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ ఒక సర్క్యూట్ ను అభివృద్ధి చేయాలన్నారు. అదిలాబాద్ వరంగల్ నాగార్జునసాగర్ లాంటి ప్రాంతాలలో ఎకో టూరిజంను మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలన్నారు.
Also Read: TTD News: ఆ ఛానెళ్లపై కేసు నమోదు.. లైసెన్స్ లను రద్దు చేయాలని టీటీడీ ఫిర్యాదు
వచ్చే గోదావరి, కృష్ణ పుష్కరాలకు భక్తులు, పర్యాటకులను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారు. పర్యాటక అభివృద్ధి తో రాష్ట్రానికి మరింత గుర్తింపు వస్తుందని, అదే రీతిలో ఆదాయం కూడా వచ్చేలా టూరిజం పాలసీను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, ఉన్నతాధికారులు
టూరిజం పాలసీపై అధికారులతో సీఎం… pic.twitter.com/FkUVOF8CVJ
— BIG TV Breaking News (@bigtvtelugu) January 29, 2025