Thandel : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం హిట్ సినిమా కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు అతనికి అర్జెంట్‌గా ఓ హిట్ కావాలి. మూడేళ్ల క్రితం బంగార్రాజు తర్వాత ఇప్పటి వరకు చైతూకి హిట్ లేదు. థ్యాంక్యూతో పాటు తన హిందీ డెబ్యూ లాల్ సింగ్ చద్దాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇక కాస్త గ్యాప్ తీసుకొని కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ప్రస్తుతం ఈ అక్కినేని హీరో తండేల్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు.. ఈ మూవీ మరో మూడు రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.. మూవీ కోసం అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నాగచైతన్య సాయి పల్లవి పలు చానల్స్ కి ఇంటర్వ్యూ ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా నిర్వహిస్తూ సినిమాకు ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది..
తండేల్ మూవీ..
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఈ మూవీలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో గతంలో లవ్ స్టోరీ అనే మూవీ వచ్చింది. ఇప్పుడు వస్తున్న తండేల్ మూవీ పై ఆశలు పెట్టుకున్నాడు నాగచైతన్య.. ఈ మూవీ హిట్ అయితే అతనికి నెక్స్ట్ మూవీ చాన్స్ లు వెతుక్కుంటూ వస్తాయి. లేదంటే ఇండస్ట్రీకి దూరం అయ్యే అవకాలు కూడా లేకపోలేదు.. ఇక కార్తీకేయ -2 బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకోవడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య చేసిన చిత్రమే తండేల్. సముద్రంలో చేపలు పట్టుకుని జీవించే మత్స్యకారులు అనుకోని విధంగా పాకిస్తాన్ బలగాలకు చిక్కడం, అక్కడి జైళ్లలో ఇబ్బందులు , తిరిగి విడుదల కావడం కోసం పడ్డ కష్టాల నేపథ్యంలో మూవీ తెరకేక్కుతుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 7 న రిలీజ్ చేస్తున్నారు..
నాగ చైతన్య కు మళ్లీ నిరాశే..?
అక్కినేని హీరో నాగ చైతన్య వరుస గా సినిమాలు చేస్తున్నా కూడా హిట్ సినిమాలు పలకరించలేదు.. కరువు ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్లు అప్పుడప్పుడు పలకరించాయి. కానీ గత రెండు, మూడేళ్లు గా నాగ చైతన్య నుంచి హిట్ సినిమాలు రాలేదు. దాంతో ఫ్యాన్స్ ఒక్క సినిమా పడితే బాగుండు అని భావిస్తున్నారు. ప్రస్తుతం తండేల్ మూవీతో ఆ కోరిక తిరుతుందని భావించినా కూడా మళ్లీ నిరాశ తప్పదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం తండేల్ మూవీ లో సాయి పల్లవి పాత్రకు నిడివి ఎక్కువగా ఉంది. నాగ చైతన్య ను పెద్దగా చూపించలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా హిట్ అయితే మాత్రం ఆ క్రెడిట్ మొత్తం సాయి పల్లవికే దక్కుతుందని తెలుస్తుంది.. ఆమె పెర్ఫార్మన్స్ ముందు చైతూ తేలిపోయాడని టాక్.. మరి ఆ వార్తల్లో అసలు నిజమేంత ఉందో తెలియాలంటే సినిమా వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..