OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ ల ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది. ఈ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఒక తమిళ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ట్విస్టులతో అదరగొడుతోంది. ఈ మూవీలో గతం మర్చిపోయిన ఒక వ్యక్తి చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఏ ఎడి ఇన్ఫినిటమ్‘ A(ad infinitum). అవంతిక ప్రొడక్షన్స్ బ్యానరులో గీతా మింసాల నిర్మించిన ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఇందులో నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని, బేబీ దీవేన, కృష్ణవేణి, భరద్వాజ్ తదితరులు నటించగా, విజయ్ కురాకుల సంగీతం సమకూర్చాడు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
సంజీవ్ రోడ్డు మీద దెబ్బలతో పడి ఉంటాడు. ఆ తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది. గతం మర్చిపోయిన సంజీవ్ కు పల్లవి నర్స్ గా ఉండటంతో, ఇద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. సంజీవ్, పల్లవి ఒకే హాస్పిటల్లో పనిచేస్తుంటారు. సంజీవ్ రిసెప్షన్ గా చేస్తుంటే, పల్లవి నర్స్ గా చేస్తుంటుంది. వీళ్ళిద్దరికీ ఒక పాప కూడా ఉంటుంది. సంజీవ్ కి ప్రతిరోజు ఒక కల వస్తూ ఉంటుంది. ఇతడు గతం మర్చిపోయి ఉండటంతో, డాక్టర్లు అతనికి గతం జ్ఞాపకాలు తెప్పించడానికి ప్రయత్నిస్తుంటారు. గతం గుర్తుకు తేవడానికి ఎంతకీ సాధ్యం కాకపోవడంతో, అతనికి వచ్చిన కలను డ్రాయింగ్ వేస్తూ ఉండమంటారు డాక్టర్లు. ఒకసారి సంజీవ్ కి అచ్చం తనలాగే ఉన్న ఒక వ్యక్తి ఫోటో కనబడుతుంది. ఆ ఫోటో ఒక నవలలో ప్రచురించి ఉంటుంది. ఆ ప్రచురించిన వ్యక్తి దగ్గరికి వెళ్లి అతను ఎవరో కనుక్కుంటాడు సంజీవ్. కొన్ని సంవత్సరాల క్రితం అశ్వర్దామ అనే వ్యక్తి బాంబు బ్లాస్ట్ కేసులో నిందితుడుగా ఉంటాడు. అంతవరకే తెలుసని ఆ నవల రాసిన వ్యక్తి చెబుతాడు.
మరోవైపు చిన్న పిల్లలని ఒక సైకో కిడ్నాప్ చేస్తూ ఉంటాడు. పోలీసులు కూడా ఆ సైకో గురించి వెతుకుతూ ఉంటారు. ఆశ్చర్యంగా పోలీసులు ఆ కిడ్నాప్ చేస్తున్నది సంజీవ్ అని తెలుసుకొని వస్తారు. అతన్ని అరెస్ట్ కూడా చేస్తారు. అయితే సంజీవ్ చిన్న పిల్లని కిడ్నాప్ చేసిన సమయంలో హాస్పిటల్లోనే ఉంటాడు. అదే రూపంలో ఉన్న మరో వ్యక్తి ఆ పాపను కిడ్నాప్ చేసి ఉంటాడు. సీసీ ఫుటేజ్ సంజీవ్ నిందితుడు కాదని తెలుసుకుంటారు. ఆ తర్వాత సంజీవ్ కూతురు కూడా కనబడకుండా పోతుంది. ఆమెను కూడా సంజీవ్ లా ఉండే మరో వ్యక్తి కిడ్నాప్ చేస్తాడు. చివరికి చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్న సైకో ఎవరు? సంజీవ్ కి గతం గుర్తుకు వస్తుందా? సంజీవ్ కి ఆ వ్యక్తులకు గతంలో ఉన్న సంబంధం ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ట్విస్ట్ లతో సాగిపోయే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.