Jani Master : టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ( Jani Master) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. గత ఏడాది వరకు ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్.. ఎన్నో హిట్ సినిమాలకు తన స్టెప్పులను అందించాడు. ఇప్పటివరకు మాస్టర్ తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో కూడా పనిచేసి డ్యాన్సర్ గా పాపులర్ అయ్యాడు.. ఇక తమిళ్ళో ఆయన కంపోజ్ చేసిన ఓ పాటకు జాతీయ అవార్డు కూడా వరించింది. ఆ అవార్డును అందుకోబోతున్నారనే సమయంలో ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. ఇక దాంతో అవార్డు కాస్త దూరం అయ్యింది. ఇక లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన మాస్టర్ దాదాపు నెల రోజుల వరకు జైల్లో ఉన్న మాస్టర్ ఇటీవలే బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మాస్టర్ గురించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట ప్రచారంలో ఉంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..
జానీ మాస్టర్ పై కేసు..
తెలుగు చిత్ర పరిశ్రమలో తన టాలెంట్ తో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే అవార్డు అందుకొనే స్థాయికి వెళ్లారు. అలాంటి మాస్టర్ గత ఏడాది లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయ్యారు. అంత పెద్ద మాస్టర్ అరెస్టు ఇవ్వడంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మాస్టర్ నిజంగానే ఒక అమ్మాయిని లైంగికంగా ఉపయోగించారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఆ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దాదాపు నెల రోజుల వరకు పాటు జైల్లోనే ఉన్న మాస్టర్ బెయిల్ పై ఇటీవలే రిలీజ్ అయ్యారు. ప్రస్తుతం అయినా సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఆయనకున్న టాలెంట్ తో ఇండస్ట్రీలో వరుస సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రేష్ఠ వర్మ మాస్టర్ గురించి సంచలన విషయాలను బయటపెట్టింది. దాంతో ఆమె చెప్పింది నమ్మాలా మాస్టర్ చెప్పింది నమ్మాలా అని జనాలు కన్ఫ్యూజన్లో పడ్డారు. తాజాగా ఈ అమ్మాయి గురించి మరో విషయం బయటకు వచ్చింది..
Also Read :ఏంటి.. తమన్నాకు ఆ పాడు అలవాటు ఉందా..?
రెండో పెళ్లి చేసుకోవడం కోసం కుట్ర..
ఇండస్ట్రీలో పేరు ఉన్న డాన్స్ మాస్టర్ లలో జానీ మాస్టర్ ఒకరు.. ఈయన టాలెంట్ ని గుర్తించి ఎంతో మంది డాన్సస్ కి మంచి లైఫ్ని ఇచ్చారు. అలాగే ఢీ కంటెస్టెంట్ అయిన శ్రేష్ట వర్మ కి కూడా డాన్సర్ గా గుర్తింపు వచ్చేలా చేశారు. పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకు శ్రేష్ట కొరియో గ్రాఫర్ గా వ్యవహారించారు. అంతవరకు బాగానే ఉంది కానీ జానీ మాస్టర్ కు జాతియ అవార్డు వచ్చిందని ప్రకటించిన తర్వాత శ్రేష్ట వర్మ తనపై లైంగిక వేధింపులు చేశారని కేసు పెట్టింది.. తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది అదేంటంటే మతం మార్చుకుని జానీ మాస్టర్ ని పెళ్లి చేసుకుని ఆలోచనలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె తల్లి కూడా మతపెద్దతో మాట్లాడి రెండో పెళ్ళికి ఏర్పాట్లు చేసుకునేలా ఉందని టాక్.. ఇటీవల కొరియోగ్రాఫర్ కూడా ఇదే విషయాన్ని బయటపెట్టారు. మరి రెండో పెళ్లి చేసుకోవడానికి జానీ మాస్టర్ ఒప్పుకుంటాడా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది..