OTT Movie : రంగుల ప్రపంచం సినిమా ఇండస్ట్రీలో, తమ అదృష్టంగా పరీక్షించుకోవడానికి ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. కొంతమందిని అదృష్టం వరించినా, మరి ఎంతోమంది తిండికి కూడా గతి లేకుండా జీవిస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో హీరో సినిమా అవకాశాల కోసం హిజ్రాగా మారుతాడు. ఇతనికి భార్య, కొడుకు కూడా ఉంటారు. ఆర్థిక పరిస్థితి ఏమాత్రం లేని ఈ వ్యక్తి, అవకాశాల కోసం ఎదుర్కొనే కష్టాలతో మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
జీ 5 (ZEE5) లో
ఈ బాలీవుడ్ డ్రామా మూవీ పేరు ‘అర్ధ్’ (Ardh). దీనికి పలాష్ ముచ్చల్ రచించి, దర్శకత్వం వహించారు. ఇందులో రాజ్‌పాల్ యాదవ్, రుబీనా దిలైక్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి సంగీతం కూడా దర్శకుడే (పలాష్ ముచ్చల్) అందించారు. ఈ బాలీవుడ్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ 5 (ZEE5) లో 10 జూన్ 2022 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
శివ సినిమా అవకాశాల కోసం ఎక్కువగా ప్రయత్నిస్తుంటాడు. ఇతనికి భార్య, కొడుకు కూడా ఉండటంతో ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. దొరికిన పని చేసుకుంటూ, అవకాశాల కోసం తిరుగుతూ ఉంటాడు. స్థిరమైన జాబ్ అంటూ ఏదీ ఉండదు. భార్య కూడా ఇళ్ళల్లో పనిచేసుకుంటూ భర్తకి సాయం చేస్తూ ఉంటుంది. కొడుక్కి ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకపోవడంతో బాధపడుతుంటాడు శివ. ఒకరోజు లేడీ గెటప్ లో ఆడిషన్ కి వెళ్తాడు. అక్కడ సెలెక్ట్ కాకపోవడంతో తిరిగి బాధపడుతూ బస్టాండ్ కి వస్తాడు. అయితే ఆడ గెటప్ లో ఉన్న అతన్ని చూసి, హిజ్రా అనుకొని ఒక వ్యక్తి డబ్బులు ఇస్తాడు. అతడు ఎందుకు ఇచ్చాడో తర్వాత అర్థమవుతుంది శివకి. ఇక అదే పని చేసుకుంటూ, ఆడిషన్ కి లకు వెళ్తూ ఉంటాడు. ఒకసారి హీరోగా అవకాశం చేయి దాక వచ్చి చేజారిపోతుంది. భార్యకు ఈ విషయం చెప్పి చాలా బాధపడతాడు. జాబ్ చేసుకోమని ఇతనికి ఒక ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. అయితే ఆర్టిస్ట్ అవ్వాలనే పిచ్చి ఉండటంతో దానిని కూడా సరిగ్గా చేయలేకపోతాడు.
తన భార్య చాలా కష్టపడుతోందని తెలిసి ఆమెను సరదాగా బయటకి తీసుకువెళ్తాడు. అప్పుడు అతని దగ్గరికి ఒక హిజ్రా వస్తుంది. తనని దీవించమని ఆ హిజ్రాకు డబ్బులు ఇచ్చి పంపుతాడు. అప్పుడు అతనికి అనిపిస్తుంది నేను ప్రజల్ని మోసం చేస్తున్నానేమో అని బాధపడతాడు. అయితే భార్య సర్ది చెప్పి, అవకాశం దొరికినప్పుడు ఇవన్నీ చెప్పవచ్చులే అంటుంది. ఆ తరువాత హిజ్రా గెటప్ లో చూసి ఒక పెద్ద డైరెక్టర్ అవకాశం ఇస్తాడు. తీరా చూస్తే అతను కల కంటాడు. చివరికి శివ కి అవకాశం దొరుకుతుందా? హిజ్రాగానే బతకాల్సి వస్తుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ 5 (ZEE5) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘అర్ధ్’ (Ardh) అనే ఈ మూవీని చూడాల్సిందే.