Guess The Actress : సినీ ఇండస్ట్రీలో నటిస్తున్న వారి కుటుంబాల గురించి తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. అందులో కొంతమంది స్టార్ హీరోల పిల్లలు మా ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని గూగుల్ లో తెగ వెతికేస్తుంటారు. అయితే ఈమధ్య సినీ తారల పిల్లల చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలు కనిపిస్తున్న బుడ్డోడు ఓ స్టార్ హీరో కొడుకు.. అచ్చం తండ్రి లాగే ఉన్న ఈ పిల్లాడు ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో, ఇటీవల హిట్ సినిమా అకౌంట్ పడలేదు. అయిన ఏడాదికి రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికైన ఆ హీరో కొడుకు ఎవరో గుర్తు పట్టారా?
మీరు అనుకున్నది అక్షరాల నిజమే..ఈ బుడ్డోడు టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ కొడుకు.. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వరుసగా సినిమాలను చేస్తున్నాడు. అయితే రవితేజ ఫ్యామిలీ గురించి పెద్దగా ఎప్పుడు బయటపెట్టడు రవితేజ.. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆయన ఫ్యామిలీ గురించి చెప్తాడు. అయితే పైన ఫోటోలో కనిపిస్తున్న బుడ్డోడు ఈయన కొడుకే.. ఈ అబ్బాయి పేరు మహాధాన్ భూపతి రాజు.. ప్రస్తుతం చదువులపై ఫోకస్ చేసిన ఈ కుర్రాడు త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ పోతున్నాడు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే తన మొదటి సినిమాని అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే రవితేజ క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..
రవితేజ సినిమాలు..
టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినీ కెరీర్ మొదట్లో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత వాళ్ళు హీరోగా అడుగుపెట్టి ఒక్క సినిమా తో తన టాలెంట్ నిరూపించుకుంటూ స్టార్ హీరో అయ్యాడు. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రవితేజ స్టార్ ఇమేజ్ ను అందుకోవడం విశేషం.. ఈమధ్య ధమాకా సినిమా తర్వాత రవితేజ ఖాతాలో హిట్ సినిమాలు పడలేదు. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మిస్టర్ బచ్చన్ మూవీ కూడా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఈమధ్య రవితేజకు బ్యాడ్ టైం నడుస్తున్న విషయం తెలిసిందే.. ఏ సినిమా చేసిన కూడా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ తో పాటు, అంతంతమాత్రంగానే కలెక్షన్స్ వసూలు చేస్తుంది. ఇకపోతే ప్రస్తుతం రవితేజ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి ఆ సినిమాల అన్నా హిట్ అవుతాయేమో చూడాలి.. రవితేజ హిట్ సినిమాని చూడాలని ఆయన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏదైనా మ్యాజిక్ జరిగి రవితేజ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సినిమాలు పడతాయేమో..