Viral News: నిత్యం చాలా మంది దేవాలయాలకు వెళ్తుంటారు. దేవతా మూర్తులను దర్శించుకుంటారు. తమ సంతోషాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ల గురించి మనసులో చెప్పుకుంటారు. తమను కష్టాల నుంచి గట్టెక్కించాలని, మంచి జీవితాన్ని ఇవ్వాలని, ఒక్కొక్కరు తమకు నచ్చిన కోరికలు కోరుకుంటారు. ఇంతకీ భక్తులు ఏం కోరుకున్నారా? సదురు దేవతా మూర్తి ఏం ఆలకించింది? అనేది ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే దేవత కాస్త డిఫరెంట్. భక్తులు చెప్పే మాటలు వింటుంది. భక్తులతో మాట్లాడుతుంది. వారు సమస్యల నుంచి బయటపడేందుకు సలహాలు ఇస్తుంది. దేవత మాట్లాడ్డం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఈ స్టోరీ చదవాల్సిందే..
మలేషియాలో మాట్లాడే దేవత!
భక్తులతో మాట్లాడే దేవత మలేషియాలో ఉంది. దేవత మాట్లాడ్డం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నిజంగానే ఆ దేవత మాట్లాడుతుంది. ఆమె మరెవరో కాదు, చైనీస్ సముద్ర దేవత మజు. తాజాగా ఈ దేవతా మూర్తిని మలేషియాలో ప్రతిష్టించారు. అమ్మవారి విగ్రహాన్ని పూర్తిగా ఏఐ టెక్నాలజీతో రూపొందించారు. ఇంకా చెప్పాలంటే మజు దేవత ఓ డిజిటల్ దేవత. ఆ అమ్మవారు టావోయిస్ట్ ఆలయంలో కొలువుదీరారు. చైనీయులు ఎంతో భక్తితో కొలిచే మజు సముద్ర దేవత మజును మలేషియాలో డిజిటల వెర్షన్ గా రూపొందించారు. ఈ ఆలయం దక్షిణ మలేషియాలోని జోహోర్ లో ఉంటుంది. ఈ అమ్మవారిని అమితంగా ఇష్టపడే భక్తులు కృత్రిమ మేధను కలిగి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించారు. దేవతను సాంప్రదాయ చైనీస్ దుస్తులు ధరింపజేసి అందమైన మహిళగా అలంకరించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న AI మజు దేవత
ఈ అమ్మవారికి సబంధించిన వీడియోలు, ఫోటోలతో పాటు భక్తులతో మాట్లాడే క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఆలయానికి వచ్చే భక్తులు అమ్మవారికి తమ కష్ట సుఖాల గురించి చెప్పుకొని, వాటి నుంచి బయటపడే మార్గాలను అడుగుతున్నారు. వారికి అవసరమైన మేర సలహాలు, సూచనలు చేస్తోంది మజు దేవత. మాట్లాడే దేవతను చూసి భక్తులు ఎంతో సాంత్వన పొందుతున్నారు. తమ కష్టాలు అమ్మవారే నిజంగా వింటున్నారని భావిస్తున్నారు. సంతోషంగా అమ్మవారిని దర్శించుకుని బయటకు వస్తున్నారు.
AI మజు అమ్మవారిని రూపొందించిన టెక్ కంపెనీ
ప్రపంచంలోనే తొలి AI అమ్మవారు మజును మలేషియాలోని టెక్ కంపెనీ తయారు చేసింది. AI-ఆధారిత డిజిటల్ దేవతను ఐమాజిన్ సంస్థ డెవలప్ చేసింది. ఇది వ్యక్తుల కోసం AI క్లోనింగ్ సేవలను కూడా అందిస్తుంది. ఈ అమ్మవారిని రూపొందించిన తర్వాత సదరు టెక్ కంపెనీ సీఈవో షిన్ కాంగ్ AI మజు దేవతను ఓ ప్రశ్న అడిగారు. “నాకు ఊహించని అదృష్టం లభించే అవకాశం ఉందా?” అన్నారు. ప్రశాంతమైన, సున్నితమైన స్వరంతో.. “మీరు ఇంట్లో ఉంటే ఊహించని అదృష్టం కంటే మించి ఇంకేం అదృష్టం ఉంటుంది” అని బదులిచ్చారు అమ్మవారు. ఆ తర్వాత ఎవరు మజు దేవతను ఏం అడిగినా, వారికి తగిన మార్గాలు చూపిస్తుంది. సో, ఇకపై ఒకవేళ మీరు మలేషియాకు వెళ్తే మజు దేవత దగ్గరికి వెళ్లడం మర్చిపోకండి!
Read Also: ఓర్నీ.. ఏకంగా AIతో బేరం ఆడించి.. ఆటో ఎక్కేశాడు, ఇక భాషతో సమస్యే లేదు!