Star Heroine : జీవితం అన్నాక ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. ధనిక పేద అనే తార్తామ్యం లేకుండా జీవితంలో ఇలాంటివి సాధించాలని చాలామంది అనుకుంటారు. అందరూ జీవితంలో పైకి ఎదగాలంటే ఏం చేయాలనీ కలలుగంటారు. మరికొందరు తమ ఆశలను నెరవేర్చుకునేంతవరకు నిష్క్రమించకుండా సాధిస్తారు. సామాన్యుల తో పాటు సెలబ్రిటీలు కూడా కొంతమంది తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతారు. కానీ కొంతమంది మాత్రం పరిస్థితులకు అనుగుణంగా తమ లక్ష్యాలను మార్చుకుంటూ ముందుకు వెళ్తుంటారు. కొంతమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ, సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెడితే, మరికొంతమంది సినీ ఇండస్ట్రీ ని వదిలి సాఫ్ట్ వేర్ రంగంలోకి వెళ్లారు. సినీ ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు ఎవరిని వరుస్తుందో చెప్పడం కష్టమే అయితే ఒకసారి మంచి హిట్ సినిమాలు వస్తున్నాయి అనుకునే లోపల ఒక్క ఫ్లాప్ సినిమా పడితే ఆ తర్వాత జీవితమే మారిపోతుంది.. ఇదిలా ఉండగా.. ఐఏఎస్ గా బాధ్యతలు తీసుకోవాల్సిన ఓ అమ్మడు ఇప్పుడు సినిమాల్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం…
టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈమెకు చిన్నప్పటి నుంచి కలెక్టర్ అవ్వాలని అందర్నీ ఆదేశించాలని కోరిక ఉండేదట.. చివరికి సినీ రంగంలోకి అడుగుపెట్టి, మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకొని నేడు పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా సినిమాలతో బిజీగా ఉంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరని ఆలోచిస్తున్నారు కదా.. ఆమె మరెవరో కాదు రాశిఖన్నా.. అవును మీరు విన్నది అక్షరాల నిజం. ఈమె సినిమాల్లోకి రాకముందు చిన్నప్పటినుంచి కలెక్టర్ అవ్వాలని కోరిక ఉందని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. స్కూల్లో ఉన్నప్పటి నుంచి అదే గోల్తో చదివిందని ఆమె అన్నది. స్కూల్ లో, కాలేజీ లో టాపర్ గా కొనసాగింది. మంచి బ్రిలియంట్ స్టూడెంట్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి, జీవితాంతం సేఫ్ గా ఉండే ఉద్యోగం చేయలని అనుకుంది. అందుకే కలెక్టర్ చదవాలని కోరుకుంది. కొంతకాలం ట్రైనింగ్ తీసుకొని పరీక్షలు కూడా రాసిందట. కానీ విఫలం అవ్వడంతో ఆ తర్వాత నటనపై ఆసక్తి పెంచుకొని సినీ రంగం వైపు అడుగులు వేసింది.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది.
తెలుగులోకి ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో హీరోగా యంగ్ హీరో నాగ శౌర్య నటించిన. తర్వాత వరుసగా సినిమా అవకాశాలను సంపాదించి, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. సౌత్ లో మంచి క్రేజ్ వచ్చిన తర్వాత ఈమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కొన్ని సినిమాలు చేసింది.. ఈమె నటించిన చివరి సినిమా సబర్మతి ఎక్స్ప్రెస్.. ఈ మూవీ థియేటర్లలోకి రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ ని అందుకుంది. ఈ సినిమాపై రాశి ఖన్నా ఆశలు పెట్టుకుంది కానీ ఆశలు అడియాసలు అయ్యాయి.. ఇకపోతే ప్రస్తుతం జీ5 యాప్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈమె పలు సినిమాలు చేయడానికిరెడీ అవుతుంది. ఆ మూవీల గురించి త్వరలోనే అనౌన్స్ చెయ్యనుందని సమాచారం..