Sri Tej Health Update : గత ఏడాది డిసెంబర్ 4 తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్ అయ్యే ఘటన ఒకటి జరిగింది.. టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ప్రీమియర్ షోలను చూసేందుకు జనాలు రాత్రుళ్ళు అయిన థియేటర్ల వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సంధ్య థియేటర్ వద్దకు తన సినిమా రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని హీరో అల్లు అర్జున్ రోడ్ షో చేసుకుంటూ థియేటర్ ప్రాంగణంలోకి ఎంట్రీ ఇచ్చాడు. హీరో వస్తున్నాడు చూడాలి అని ఫ్యాన్స్ ఆసక్తిగా పరుగులు పెట్టారు. ఆ క్రమంలో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. జనాల మధ్యలో ఇరుక్కున్న ఓ మహిళ, ఆమె కుమారుడు లోపలికి రాలేక గేటు బయటే స్పృహ తప్పి పడిపోయారు. ఆ మహిళ ప్రాణాలను విడిచింది. ఆమె కుమారుడు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్నాడు. బాలుడు ఆరోగ్యం మెరుగవ్వాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యం కొద్ది కొద్దిగా మెరుగవుతుందని కిమ్స్ వైద్యులు ఎప్పటికప్పుడు వైద్యులు హెల్త్ బులిటెన్ ను విడుదల చేస్తున్నారు. తాజాగా మరో హెల్త్ అప్డేట్ ను డాక్టర్స్ అనౌన్స్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..
పుష్ప 2 ఘటన..
పుష్ప 2 ప్రీమియర్ షోలో జరిగిన ఘటన తర్వాత సినిమా హిట్ అయిన కూడా సక్సెస్ మీట్ లకు చిత్ర యూనిట్ దూరంగా ఉన్నారు. అల్లు అర్జున్ రావడం వల్ల థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిందని దాంతో ఆ మహిళ మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. దాంతో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బెయిల్ పై బయటకు వచ్చాడు. కానీ ఆ తర్వాత అల్లు అర్జున్ ను కోర్టు చుట్టూ తిరిగేలా చేసింది. ఆయన అభిమానులు ఏడవని రోజంటూ లేదు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి సైతం అసెంబ్లీ లో అల్లు అర్జున్ తీరుని తప్పుబట్టడంతో, జనాల్లో అల్లు అర్జున్ పై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ఇక తొక్కిసలాట లో చనిపోయిన రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణాలతో ఆస్పత్రి బెడ్ పైనే పోరాడుతున్నాడు. ఇప్పటికీ శ్రీతేజ్ ఆరోగ్యం అలానే ఉందని తెలుస్తుంది.. అల్లు అర్జున్ తో పాటు పుష్ప మూవీ టీం మొత్తం కలిసి శ్రీతేజ్ కుటుంబానికి రెండు కోట్ల రూపాయిల విరాళాన్ని అందించారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా శ్రీతేజ్ వైద్యానికి అయ్యే ఖర్చుని పెట్టుకుంది.. ఇక డాక్టర్లు అతన్ని బ్రతికించడం కోసం ప్రాణాలతో పోరాడుతూనే ఉన్నారు.
శ్రీతేజ్ హెల్త్ అప్డేట్..
శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని కిమ్స్ హాస్పిటల్స్ డాక్టర్లు విడుదల చేసారు. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి బాగానే ఉందట. ఒకప్పుడు స్పృహలో లేకుండా ఉండేవాడని, ఇప్పుడు ఎక్కువసేపు మేలుకవలో ఉంటున్నాడని అంటున్నారు డాక్టర్లు. అయితే శ్రీతేజ్ తన కుటుంబ సభ్యులను గుర్తుపట్టలేకపోతున్నాడట. పలకరిస్తుంటే అతని నుండి ప్రతిస్పందన సరిగా లేదని అంటున్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. బాధ పడాల్సిన విషయం ఏమిటంటే పాపం శ్రీతేజ్ కి తన తల్లి చనిపోయింది అనే విషయం ఇప్పటి వరకు తెలియదు. పాపం ఆమె ఎలా ఉంటుందో కూడా అతనికి గుర్తు లేదు.. అతనికి పూర్తిగా ఆరోగ్యం కోరుకున్న తర్వాత అతని తల్లి రాదని ఇక జన్మలో తన తల్లిని చూడలేనన్న విషయం తెలిస్తే ఆ పసి హృదయాలు పోతుంది. ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నా ఆ చిన్నారి తల్లి లేదన్న విషయం తెలిస్తే ఏమైపోతాడో అని ప్రజలు బాధపడుతున్నారు. దేవుడు అతనికి గతం మర్చిపోయేలా చేసి మంచి పనే చేసాడు. ఒకవేళ తన తల్లి చనిపోయింది అనే విషయం తెలిస్తే పాపం అతను ఏమైపోతాడో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు..