BigTV English

Super Foods: మీ పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలా? ప్రతిరోజు ఈ ఐదు సూపర్ ఫుడ్స్ తినిపించండి

Super Foods: మీ పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలా? ప్రతిరోజు ఈ ఐదు సూపర్ ఫుడ్స్ తినిపించండి

చిన్నప్పటినుంచి పిల్లలకు పెట్టే ఆహారమే వారి భవిష్యత్తులో ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి మీరు పిల్లలకు పెట్టే ఆహారం పోషకాలతో నిండి ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా పిల్లల శారీరక ఎదుగుదలకే కాదు, మానసిక ఎదుగుదల కోసం కూడా ప్రత్యేకమైన ఆహారాన్ని తినిపించాలి. మీ పిల్లల మెదడు శక్తిని పెంచడానికి కొన్ని రకాల సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. వాటిని ఆహారంలో భాగంగా చిన్నప్పటి నుంచే తినిపించడం నేర్చుకోండి.


దీనివల్ల మీ బిడ్డ చురుకుగా ఎదగడంతో పాటు మానసికంగా ఉత్సాహంగా జీవిస్తాడు. ప్రతిదీ త్వరగా నేర్చుకుంటాడు. గ్రహణ శక్తి పెరుగుతుంది. ఏకాగ్రత వంటివి పెరిగి చదువుల్లో ముందడుగు వేస్తాడు. ఇక్కడ మేము చెప్పిన ఆహారాలన్నీ కూడా మీ పిల్లల మెదడు శక్తిని పెంచడానికి సహాయపడేవే. వారి మెదడును పదునుగా మార్చేవే. కాబట్టి ఈ ఆహారాలు ప్రతిరోజూ కాకపోయినా ప్రతి రెండు రోజులకు ఒకసారి అయినా తినిపించేందుకు ప్రయత్నించండి. లేదా ఈ ఐదు ఆహారాలలో ప్రతిరోజు కనీసం రెండు పదార్థాలను వారి చేత తినిపించేందుకు ట్రై చేయండి.

డ్రై ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్ మార్కెట్లో ఎన్నో లభిస్తున్నాయి. వాటిలో జీడిపప్పులు, వాల్నట్స్, బాదం పప్పులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా మెదడు పనితీరును మారుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మూడేళ్ల వయసు నుంచే బాదంపప్పులు, వాల్నట్స్, జీడిపప్పులు వంటివి వారి ఆహారంలో భాగం చేయండి. ఈ మూడు కలిపి ప్రతిరోజు ఒక గుప్పెడు వారిచేత తినిపించండి. వారి మెదడు చురుగ్గా పనిచేస్తుంది.


పాల ఉత్పత్తులు
పాలతో తయారు చేసిన ఏ ఉత్పత్తి అయినా ఆరోగ్యానికి మేలే చేస్తుంది. ప్రతిరోజూ వారికి పాలు, పెరుగు వంటివి పెట్టేందుకు ప్రయత్నించండి. వీటిలో కాల్షియం, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండూ కూడా జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి ప్రతిరోజు గ్లాసు పాలు తాగిపించడంతో పాటు ఒక పూట పెరుగుతో అన్నం తినిపించండి. పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

ఆకుపచ్చని కూరగాయలు
పాలకూర, బ్రకోలి వంటి ఆకుపచ్చని ఆకుకూరలు ఎన్నో లభిస్తాయి. వీటి ధరలు కూడా తక్కువగానే ఉంటాయి. బ్రకోలి ధర ఎక్కువగా ఉన్నా మిగతా ఆకుకూరల ధరలు తక్కువగానే ఉంటాయి. క్యాప్సికం, కొత్తిమీర, పాలకూర, తోటకూర, కీరాదోస, సొరకాయ వంటి ఆకుపచ్చగా ఉండే కూరలను పిల్లలకు వండి పెట్టండి. వీటిలో ఐరన్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. ఇవన్నీ కూడా మెదడును పదును చేస్తాయి. వారి ఆలోచనలు, నిర్ణయాలు స్పష్టంగా ఉండేలా చేస్తాయి.

కోడిగుడ్లు
కోడిగుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది మెదడు కండరాలను బలోపేతం చేయడానికి, అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ కోడిగుడ్లు కేవలం మానసిక ఆరోగ్యానికే కాదు. శారీరక పటుత్వానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతిరోజు ఉడకబెట్టిన ఒక కోడిగుడ్డు తినిపించేందుకు ప్రయత్నించండి.

చేపలు
చికెన్, మటన్ వంటి వాటితో పోలిస్తే చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఈ చేపలు మెదడును చురుకుగా మారుస్తాయి. దీర్ఘకాలికంగా మానసిక సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. కాబట్టి చేపలను ప్రతి మూడు రోజులకు ఒకసారి తినిపించేందుకు ప్రయత్నించండి. ఇది మీకు ఎంతో సహాయపడతాయి. చేపలు తినిపించేటప్పుడు ముళ్ళు తీసి తినిపించడం మర్చిపోవద్దు. లేకుంటే గొంతులో ఇరుక్కుని పిల్లలు ఇబ్బంది పడతారు.

పైన చెప్పిన ఆహారాలను వారంలో కనీసం ఐదుసార్లు అయినా తినిపించడానికి ప్రయత్నించండి. వాల్నట్స్, బాదం, జీడిపప్పులు, కోడిగుడ్డు వంటివి ప్రతిరోజూ తినిపించాలి. అలాగే పాలను కూడా ప్రతిరోజు పెట్టవచ్చు. పెరుగుతో అన్నం కలిపి తినిపించవచ్చు. ఇక ఆకుపచ్చని కూరగాయల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకుని ప్రతిరోజు ఒక పూట తినిపించండి. చేపలు ప్రతిరోజు పెట్టడం కష్టం కాబట్టి మూడు రోజులకు ఒకసారి తినిపించేందుకు ప్రయత్నించండి. ఇవన్నీ కూడా వారిలో శారీరక మానసిక శక్తిని పెంచుతాయి. మెదడును ఎదిగేలా చేస్తాయి.

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×