E-Paper
Advertisement

The Greatest of All Time: విజయ్ సినిమాపై దారుణంగా ట్రోల్స్..కారణం ఇదే..?

The Greatest of All Time: విజయ్ సినిమాపై దారుణంగా ట్రోల్స్..కారణం ఇదే..?
Advertisement

The Greatest of All Time: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తమిళ్ సహా తెలుగులో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఇటీవలే ‘లియో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగా దానిపై ట్రోల్స్ మొదలయ్యాయి. అంతేగాక ఈ మూవీ పక్కా కాపీ కంటెంట్ అని అంటున్నారు. అయితే ఆ ట్రోల్స్‌కు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ మూవీకి ఇన్నాళ్లు ‘దళపతి 68’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలిచారు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి గానూ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు విజయ్ డ్యూయల్ రోల్‌లో ఉన్న ఓ పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్‌ ఇలా రిలీజ్ అయిందో లేదో ట్రోలింగ్ మొదలైంది.

Advertisement

ఆ పోస్టర్‌లో డ్యూయల్ రోల్‌లో కనిపించిన విజయ్.. ఒక క్యారెక్టర్‌లో వయసు మళ్లిన వ్యక్తిగా.. మరో క్యారెక్టర్‌లో యువకుడిగా ఉన్నాడు. అయితే విజయ్‌ను యువకుడిగా చూపించడానికి మేకర్స్ ఏఐ వాడారు అన్న విషయం అర్థమవుతుంది. ఆ ఫేషియల్ సెట్టింగ్ కామెడీగా ఉండటంతో విజయ్ లుక్‌పై దారుణంగా ట్రోల్ జరుగుతోంది. మరోవైపు ఈ మూవీ పక్కా కాపీ కంటెంట్ అని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ పోస్టర్‌ను చూసి.. ఇది హాలీవుడ్ మూవీ ‘జెమిని మ్యాన్’కు రీమేక్ అని అంటున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×