BigTV English

S Jaishankar : రష్యాతో బంధం మాకు ఎప్పటికీ ముఖ్యమే.. జై శంకర్‌ కీలక వ్యాఖ్యలు..

S Jaishankar : ఇటీవలి తన రష్యా పర్యటనపై వస్తోన్న విమర్శలు, భారత్‌ విషయంలో పాకిస్థాన్‌, కెనడా అనుసరిస్తోన్న విధానాల గురించి కేంద్రమంత్రి ఎస్‌ జై శంకర్‌ స్పందించారు. ఇతర దేశాలతో వ్యవహరించేటప్పుడు భారత్‌ ఆలోచనాత్మకంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే రష్యాతో సంబంధాలు స్థిరంగా ఉన్నాయన్నారు. అవి భారత్‌కు ఎంతో కీలకమని మరోసారి జయశంకర్ స్పష్టం చేశారు. తన రష్యా పర్యటనపై పాశ్చాత్య మీడియా నుంచి వస్తోన్న విమర్శలకు జయశంకర్ కౌంటర్ ఇచ్చారు.

S Jaishankar : రష్యాతో బంధం మాకు ఎప్పటికీ ముఖ్యమే.. జై శంకర్‌ కీలక వ్యాఖ్యలు..
This image has an empty alt attribute; its file name is ac7086a657ce9a8ed9d68679019b6a62.jpg

S Jaishankar : ఇటీవలి తన రష్యా పర్యటనపై వస్తోన్న విమర్శలు, భారత్‌ విషయంలో పాకిస్థాన్‌, కెనడా అనుసరిస్తోన్న విధానాల గురించి కేంద్రమంత్రి ఎస్‌ జై శంకర్‌ స్పందించారు. ఇతర దేశాలతో వ్యవహరించేటప్పుడు భారత్‌ ఆలోచనాత్మకంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే రష్యాతో సంబంధాలు స్థిరంగా ఉన్నాయన్నారు. అవి భారత్‌కు ఎంతో కీలకమని మరోసారి జయశంకర్ స్పష్టం చేశారు. తన రష్యా పర్యటనపై పాశ్చాత్య మీడియా నుంచి వస్తోన్న విమర్శలకు జయశంకర్ కౌంటర్ ఇచ్చారు.

డిసెంబర్‌లో జై శంకర్ రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల పర్యటనలో భాగంగా అధ్యక్షుడు పుతిన్‌తో ఆయన భేటీ అయ్యారు. దీనిపై పాశ్చాత్య మీడియా విమర్శలు చేస్తోంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతే.. మా మైండ్‌ గేమ్‌ పనిచేస్తున్నట్టే లెక్క అన్నారు. వారు ఏమైనా ఊహించుకోవచ్చు కానీ మా విధానం మాత్రం ఎప్పుడూ స్థిరంగా ఉంటుందన్నారు.

రష్యాతో బంధం మాకు ఎప్పటికీ ముఖ్యమే అని మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. 2022 ప్రారంభం నుంచి రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం నడుస్తోందన్నారు. ఈ యుద్ధం విషయంలో ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాలన్నారు. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకొని భారత్ స్వతంత్ర వైఖరిని ప్రదర్శించిందన్నారు. సార్వభౌమత్వం, దేశ ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. చర్చల ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనాలని రష్యాకు భారత్ సూచించిందన్నారు. ఇక ఈ పర్యటనలో ప్రధాని మోదీ సందేశాన్ని పుతిన్‌కు మంత్రి జై శంకర్ అందజేశారు. అదే సమయంలో రష్యాలో పర్యటించాలని ప్రధాని మోదీకి పుతిన్‌ ఆహ్వానం పంపారు.

భారత్‌ను అస్థిరపరిచేందుకు పాక్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని మంత్రి జై శంకర్ దుయ్యబట్టారు. దశాబ్దాలుగా పాక్‌ ప్రవర్తన అలాగే ఉందన్నారు. కానీ తమ విధానాల ద్వారా ఆ జిత్తుల్ని చిత్తు చేశామన్నారు. అలాగే కెనడాతో దౌత్యపరమైన విభేదాల గురించి మంత్రి స్పందించారు. ఆ దేశ రాజకీయాలు.. ఖలిస్థానీ శక్తులకు చోటు కల్పించాయని ఆయన విమర్శించారు. రెండు దేశాల సంబంధాలను దెబ్బతీసే కార్యకలాపాలను అనుమతించాయని మంత్రి జై శంకర్ మండిపడ్డారు.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×