E-Paper
Advertisement

మూడు పార్టీలు.. మూడు స్కెచ్‌లు.. ఒక్కటే టార్గెట్!

మూడు పార్టీలు.. మూడు స్కెచ్‌లు.. ఒక్కటే టార్గెట్!
Advertisement

Telangana 2028 Elections: రాజకీయాల్లో ఏ పార్టీకైనా, ఏ నాయకుడికైనా ఎన్నికల్లో గెలవాలన్నా, సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగాలన్నా ప్రజల అభిమానాన్ని, నమ్మకాన్ని గెలుచుకోవడమే ముఖ్యం. సాధారణంగా ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రారంభమయ్యే రాజకీయ వ్యూహాలు, తెలంగాణలో మాత్రం రెండేళ్ల ముందే వేడెక్కాయి. 2028 నవంబర్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పుడే సమాయత్తమవుతున్నాయి. విశేషం ఏంటంటే.. ఎన్నికలకు ఏడాది ముందే, అంటే 2027 నాటికే మూడు పార్టీలు పూర్తిగా గ్రౌండ్ లోనే ఉండి.. తాము చేసింది చెప్పుకుంటూ ప్రజాభిమానాన్ని చురగొనేలా పక్కా ప్లాన్లతో సిద్ధమవుతున్నాయి.

కాంగ్రెస్ ధీమా..

Advertisement

రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా, కనీసం 2034 వరకు తామే అధికారంలో ఉంటామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో విపక్షాల దాడిని తిప్పికొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు ఒంటి చేత్తోనే పోరాడుతున్నారు.

రేవంత్ రెడ్డి మార్క్ స్ట్రాటజీ..

Advertisement

ఇక్కడ రేవంత్ రెడ్డి మార్క్ స్ట్రాటజీ ఒక్కటే.. ‘చేసింది చెప్పుకోండి.. లేకపోతే జనాలకి ఎలా తెలుస్తుంది?’ అనేది ఆయన క్యాడర్‌కు ఇస్తున్న పవర్‌ఫుల్ నినాదం. ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, రైతు రుణమాఫీ వంటి గ్యారంటీల విజయాలను ప్రతి ఇంటికీ చేర్చాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు పదేపదే చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా ఉండాలంటే నిరంతరం జనాల్లో ఉండటమే మార్గమని భావిస్తున్న కాంగ్రెస్, 2027 నాటికి క్యాడర్ అంతటినీ పూర్తిగా క్షేత్రస్థాయిలోనే ఉంచేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటోంది.

మన గతమే మన బలం.. బీఆర్ఎస్

మరోవైపు, పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన భారత రాష్ట్ర సమితి (BRS) ‘మన గతమే మన బలం, అదే మన భవిష్యత్తు విజయం’ అనే నినాదంతో ముందుకు సాగుతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు త్రయం నాయకత్వంలో ఆ పార్టీ నీటిపారుదల రంగాన్ని తమ ప్రధాన రాజకీయ ఆయుధంగా మార్చుకుంది. 2023 ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం బీఆర్ఎస్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. కానీ ఇప్పుడు అదే కాళేశ్వరాన్ని ఆ పార్టీ కాంగ్రెస్‌పై రివర్స్ అటాక్ చేయడానికి వాడుకుంటోంది. కేవలం సుమారు ₹2,000 కోట్లతో అయ్యే చిన్నపాటి మరమ్మతు పనులను (Repairs) చేసి, నీటిని ఎత్తిపోయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఒకవేళ రిపేర్లు త్వరగా పూర్తి చేసి నీటిని ఎత్తిపోస్తే ఆ క్రెడిట్ అంతా కేసీఆర్‌కే వెళ్తుందనే భయంతోనే కాంగ్రెస్ కాలయాపన చేస్తోందని, ఫలితంగా వేల టీఎంసీల గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోయి రాష్ట్రంలో కరువు పరిస్థితులు వస్తున్నాయని బీఆర్ఎస్ వాదిస్తోంది. నాడు తమ హయాంలో ఉన్న సస్యశ్యామల తెలంగాణను, నేటి పరిస్థితులను అడుగడుగునా పోలుస్తూ ఏడాది ముందే జనం మధ్యకు వెళ్తోంది.

Also Read: ఆర్గానిక్ అంత్యక్రియలు.. చనిపోయిన తర్వాత డెడ్ బాడీని ఏం చేస్తారంటే..

పక్కా వ్యూహంతో రంగంలోకి దిగిన బీజేపీ..

ఇక తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ లకు ఏకైక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి, 2028లో మొదటిసారి రాష్ట్రంలో జెండా ఎగరేయాలని భారతీయ జనతా పార్టీ (BJP) ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం జాతీయ నాయకత్వం పక్కా వ్యూహంతో రంగంలోకి దిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సల్ రాష్ట్ర నేతలకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. కేవలం హైదరాబాద్ ఆఫీసులకే పరిమితం కాకుండా, ప్రతి నియోజకవర్గంలో బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని, నిరంతరం క్షేత్రస్థాయిలోనే ఉండాలని స్పష్టం చేశారు. గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయని వారికి రాబోయే రోజుల్లో పదవులు ఉండవనే హెచ్చరికలతో పార్టీని పూర్తి ఎలక్షన్ మోడ్‌లోకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి తరహా ప్రయోగాలు సక్సెస్ అయినప్పటికీ, తెలంగాణలో మాత్రం సమీకరణాలు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే పొత్తుల ప్రసక్తే లేదని బీఆర్ఎస్, ఒంటరిగానే అధికారంలోకి వస్తామని బీజేపీ స్పష్టం చేస్తున్నాయి.

ఈ వ్యూహాలు ట్రైలర్ మాత్రమే..!

ఈ ముక్కోణపు పోరుకు 2027 వ్యూహాలు అత్యంత కీలకం కానున్నాయి. ఎందుకంటే మూడు పార్టీలు తమ సర్వశక్తులనూ ఒడ్డి, ఏడాది ముందే పూర్తిగా గ్రౌండ్ లోనే ఉండి.. ఎవరికి వారు తాము చేసిన పనులను గట్టిగా చెప్పుకుంటూ ప్రజాభిమానాన్ని చూరగొనేందుకు ప్రణాళికలు అమలు చేయబోతున్నారు. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఇప్పుడు వినిపిస్తున్న నినాదాలు, కనిపిస్తున్న వ్యూహాలు రాబోయే మహా సంగ్రామానికి ట్రైలర్ మాత్రమే! కాంగ్రెస్ తన అధికారాన్ని కాపాడుకోవడానికి ‘ఆరు గ్యారంటీల అస్త్రాన్ని’ నమ్ముకుంటే.. బీఆర్ఎస్ పోగొట్టుకున్న వైభవాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ‘కాళేశ్వరం-నీటిపారుదల సెంటిమెంట్‌ను’ పొలిటికల్ వెపన్‌గా మారుస్తోంది. ఇక ఢిల్లీ అండతో కదం తొక్కుతున్న బీజేపీ.. ‘మోదీ ఇమేజ్ – క్షేత్రస్థాయి సంస్థాగత బలాన్ని’ నమ్ముకుంది. ఎవరి వ్యూహాలు వారికున్నాయి.. ఎవరి లెక్కలు వారికున్నాయి. కానీ, తెలంగాణ ఓటరు ఎప్పుడూ నిశ్శబ్దంగానే తీర్పు ఇస్తాడు, ఆ తీర్పుతోనే చరిత్రను తిరగరాస్తాడు. 2028లో ఈ మూడు పార్టీలు గ్రౌండ్‌లోకి దిగి ముఖాముఖి తలపడనున్న వేళ.. కోట్లాది మంది ప్రజల గుండెల్లో నిలిచి ‘ప్రజాభిమానం’ దక్కించుకునే ఆ నాయకుడు ఎవరో కాలమే తేల్చనుంది!

Tags

Related News

ఎల్‌నినో దెబ్బకు చెక్.. అర్నబ్ తుపాన్‌తో నిండిన ఉత్తరాంధ్ర రిజర్వాయర్లు

సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాలు అడుగుతున్నారని ప్రచారం! ఏకంగా ప్రెస్‌మీట్‌లోనే ఆ పత్రాన్ని చూపిన కేటీఆర్‌..! సర్కార్‌ ఖండించినా ఆగని దుష్ప్రచారం!

రాహుల్‌ను ప్రధానిని చేయలేదు..:! కేటీఆర్‌ను సీఎం చేస్తా..! కేసీఆర్‌కు కలిసిరాని కాలం! ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం..?

గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో కనిపించని జోష్.. ఎందుకో తెలుసా..?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తప్పుడు సంకేతాలా? ఆ మంత్రుల పరపతికి పరోక్షంగా దెబ్బకొట్టే యత్నమా? బీఆరెస్‌ వ్యూహంలో భాగంగానే సురేఖ సారీ పాచికా?

కేంద్ర కరువు సాయం ప్యాకేజీపై పెదవి విరుపేనా? నాడు కేసీఆర్‌కు చేదు అనుభవం..! ఇప్పుడు 20వేల కరువు ప్యాకేజీలో ఎంతిస్తారో?

రాజీవ్‌ను సోనియా వద్దన్నారు! సోనియాను రాహుల్‌ వద్దన్నారు! ‘బిలాంగింగ్‌ .. ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ బుక్‌ నేపథ్యంలో కొత్త చర్చ!

Big Stories

Advertisement
×