E-Paper
Advertisement

గణేశ్ నిమజ్జనాల ఎఫెక్ట్.. హుస్సేన్‌సాగర్‌లో పడిపోయిన నీటి నాణ్యత.. కెమికల్స్, బ్యాక్టీరియా గుర్తింపు!

గణేశ్ నిమజ్జనాల ఎఫెక్ట్.. హుస్సేన్‌సాగర్‌లో పడిపోయిన నీటి నాణ్యత.. కెమికల్స్, బ్యాక్టీరియా గుర్తింపు!
Advertisement

Hussain Sagar Pollution: వినాయక చవితి వేడుకల సందర్భంగా హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనంతో నీటి నాణ్యత బాగా క్షీణించిందని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) వెల్లడించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిబంధనల ప్రకారం.. నిమజ్జనానికి ముందు (సెప్టెంబరు 11), నిమజ్జనం సమయంలో (సెప్టెంబరు 17, 19, 21, 23), నిమజ్జనం తర్వాత (సెప్టెంబరు 28) మూడు విడతల్లో నీటి నమూనాలను సేకరించి విశ్లేషించింది. ఈ మేర‌కు పర్యావరణ అధ్యయన ఫలితాలను బోర్డు విడుదల చేసింది.

హుస్సేన్‌సాగర్‌లోని ఎన్టీఆర్ పార్క్ ప్లాట్‌ఫాం-1, ప్లాట్‌ఫాం-2, లుంబినీ పార్క్, నెక్లెస్ రోడ్, లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్, బుద్ధ విగ్రహం కంట్రోల్ పాయింట్ ప్రాంతాల్లో ఈ పర్యవేక్షణ చేపట్టింది. విగ్రహాల నిమజ్జనంతో నీటి నాణ్యత తీవ్రంగా దెబ్బతిన్నట్లు పరీక్షల్లో స్పష్టమైంది. నిమజ్జన సమయంలో హుస్సేన్‌సాగర్‌లో టర్బిడిటి (నీటి మసకదనం) విపరీతంగా పెరిగింది. నెక్లెస్ రోడ్ వద్ద గరిష్టంగా 200 NTU నమోదు కాగా.. ఎన్టీఆర్ పార్క్ ప్లాట్‌ఫాం-1 వద్ద తేలియాడే ఘన పదార్థాలు లీటరుకు 99 మిల్లీగ్రాములుగా నమోదయ్యాయి.

Advertisement

నీటిలో రసాయనిక ఆక్సిజన్, జీవ రసాయనిక ఆక్సిజన్ డిమాండ్ స్థాయులు గణనీయంగా పెరిగాయి. నెక్లెస్ రోడ్ వద్ద అత్యధికంగా 164 మి.గ్రా/లీ సీఓడీ నమోదైంది. నిమజ్జనం పూర్తయిన తర్వాత కూడా నీటి నాణ్యత సాధారణ స్థితికి చేరలేదని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా సాగర్‌లో కోలిఫామ్, ఫీకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా స్థాయిలు అన్ని ప్రాంతాల్లోనూ పెరిగాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో నిమజ్జనం పూర్తయ్యాక తగ్గినప్పటికీ లుంబినీ పార్క్, లేపాక్షి పాయింట్ల వద్ద నిమజ్జనం తర్వాత కూడా బ్యాక్టీరియా స్థాయిలు అధికంగానే కొనసాగాయని తెలిపింది.

Also Read: CJP నేత సౌరవ్ దాస్‌కు షాక్.. పౌరసత్వంపై విచారణకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Advertisement

విగ్రహాల నిమజ్జనం వల్ల నీటిలో కరిగిన ఆక్సిజన్ ప్రమాణాల్లో మాత్రం పెద్దగా మార్పులు నమోదు కాలేదని బోర్డు స్పష్టం చేసింది. సెప్టెంబరు 14, 19, 20, 22 తేదీల్లో కురిసిన భారీ వర్షాల వల్ల క్యాచ్‌మెంట్ ప్రాంతాల నుంచి వరద నీరు చేరడం కూడా సాగర్ నీటి నాణ్యత క్షీణతకు కొంత కారణమైందని టీజీపీసీబీ పేర్కొంది. జలవనరుల రక్షణ అందరి బాధ్యత అని, భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణకు ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు, ప్రభుత్వ విభాగాలు పూర్తిస్థాయిలో సహకరించాలని కాలుష్య నియంత్రణ మండలి విజ్ఞప్తి చేసింది.

Also Read: యాపిల్ నుంచి మరో సంచలనం.. కేవలం 5.2 మిమీ మందంతో వస్తున్న iPhone Air 2!

Tags

Related News

హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన క్లైమేట్.. దంచికొడుతున్న వాన.. రాబోయే 2 గంటలు హైఅలర్ట్!

నా చావుకి డాక్టర్లు, పోలీసులే కారణం.. అట్టముక్కపై సూసైడ్ నోట్ రాసి టెక్కీ ఆత్మహత్య!

ఏడాది తర్వాత వీడిన ఖమ్మం మర్డర్ మిస్టరీ.. చెప్పుల క్లూతో చిక్కిన కిల్లర్స్!

మియాపూర్ భూముల కేసులో ప్రభుత్వ గెలుపు.. KCR, KTRలపై విరుచుకుపడ్డ చనగాని దయాకర్

రూ.84,790 కోట్లతో భాగ్యనగరం రూపురేఖలు చేంజ్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిగ్ ప్లాన్!

మణిపూర్ పోకుండా ఇక్కడికెందుకొచ్చావ్? అమిత్ షాపై మంత్రి పొన్నం ఫైర్!

మియాపూర్ భూముల వ్యవహారం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు, లక్షా 50 వేల కోట్ల భూములు కాపాడాం

Big Stories

Advertisement
×