Tollywood Heroine : తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది సినిమాలు చేసుకుంటూ బ్రతికేస్తున్నారు. ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ తో పాటుగా అదృష్టం కూడా ఉండాలని అంటున్నారు. అలాంటి లక్ తెలుగులో ఒకప్పుడు కమెడియన్ గా తన టాలెంట్ తో అందరి మనసును దోచుకున్నాడు సునీల్.. కేరీర్ ఆరంభంలో హాస్య నటుడుగా వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సినిమాలు చేశాడు. కాని కొన్ని సినిమాలు హిట్ అవ్వకపోవడంతో హీరోగా రాణించలేక పోయాడు. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దాంతో మళ్లీ కమెడియన్ గా యు టర్న్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు విలన్ గా సెటిల్ అయ్యాడు.. రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 మూవీలో నటించాడు. అయితే సునీల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
త్రివిక్రమ్ తో కలిసి అవకాశాల కోసం కాళ్ళు అరిగేలా తిరిగాడు. అలా చివరికి ఈయన ఇండస్ట్రీకి కమెడియన్ గా పరిచయం అయ్యాడు.ఆ తర్వాత అందాల రాముడు, మర్యాద రామన్న వంటి సినిమాలతో హీరోగా మారిపోయారు.. అయితే సునీల్ ను ఓ హీరోయిన్ దారుణంగా కొట్టిందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అందులో నిజమేంతుందో తెలుసుకుందాం..
కమెడియన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సునీల్ కామెడీ ఫేస్ లా ఉండడంతో సినిమాల్లో ఆయన కామెడీ బాగా పండింది. దాంతో ఈయనకు వరుస సినిమాల్లో కమెడీయన్ అనగా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత హీరో అవకాశాలు కూడా వచ్చాయి. సునీల్ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తో చాలా సరదాగా మాట్లాడుతూ వారిపై ఫన్నీ ఫన్నీ సెటైర్లు వేస్తూ ఉంటారట.. అలా హీరోయిన్ త్రిష తో కూడా సెటైర్లు వేస్తూ సరదాగా అన్నాడట.. ఒక అంతే.. అప్పటికే కోపంలో ఉన్న త్రిష అందరి ముందే సునీల్ చెంప పగలగొట్టిందట. దానికి కాస్త అవమానంగా ఫీల్ అయిన సునీల్ నెక్స్ట్ డే షూటింగ్ కి కూడా రాలేదట. ఆ తర్వాత చిత్ర యూనిట్ ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సునీల్ మళ్ళీ సినిమా షూటింగ్ లో పాల్గొనలేదట.. ఆ తర్వాత అందరు వెళ్లి బ్రతిమ లాడితే వెళ్లి షూటింగ్ లో పాల్గొన్నదట.. ఆ విషయాన్నీ సునీల్ ఇంకా మర్చిపోలేదని టాక్..
ఇక కేరీర్ మొదట నుంచి కామెడి తో కడుపుబ్బా నవ్విస్తున్న సునీల్ కలర్ ఫోటో సినిమా ద్వారా విలన్ గా మారిన సునీల్ పాన్ ఇండియా విలన్ గా కూడా మారిపోయారు స్టార్ హీరోలైన అల్లు అర్జున్, రజినీకాంత్ సినిమాలలో విలన్ పాత్ర లో అదరగొట్టేశారు.. రీసెంట్ గా అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ పుష్ప 2 లో విలన్ గా కనిపించాడు. సినిమా భారీ సక్సెస్ ను అందుకుంది.. ఇక ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.