Peepal Leaves: ఆయుర్వేదంలో రావి చెట్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. రావి ఆకులు, బెరడు, వేర్లు ఔషధ గుణాలతో నిండి ఉంటాయని చెబుతారు. రావి ఆకులు పర్యావరణాన్ని మేలు చేయడమే కాకుండా వీటి ఉపయోగం ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తుంది. హిందువులు రావి చెట్టును పూజిస్తారు. అయితే, ఈ రోజు మనం రావి ఆకులను నీటిలో మరిగించి తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
రావి ఆకుల్లో ఔషధ గుణాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ ఫంగల్ లక్షణాలు రావి ఆకులలో ఉన్నాయి. ఇందులో ఉండే టానిన్లు, ఫైకోసైనిన్, ఫైటోకెమికల్స్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. రావి ఆకులను మరిగించి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: గుండె సమస్యలకు రావి ఆకులు చాలా మేలు చేస్తాయి. వీటితో తయారు చేసిన నీటిని త్రాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉండి గుండె కండరాలు బలపడతాయి.
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది : రావి ఆకుల వాటర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపులో గ్యాస్, అజీర్ణం , అసిడిటీ వంటి సమస్యలను తొలగించడంలో ఇది సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది : రావి ఆకులలో యాంటీఆక్సిడెంట్లు , యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఫలితంగా వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
నిర్విషీకరణకు ఉపయోగపడుతుంది: ఉడకబెట్టిన రావి ఆకుల నీటిని తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు తొలగిపోతాయి.
ఒత్తిడి , ఆందోళనను తగ్గించడం: రావి ఆకులలో మెదడును శాంతపరిచే అంశాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.
Also Read: మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ?
రావి ఆకులతో నీరు ఎలా తయారు చేయాలి ?
5-6 తాజా, ఆకుపచ్చ రంగులో ఉన్న రావి ఆకులను తీసుకోండి.
ఆకులను బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఒక పాత్రలో 2-3 కప్పుల నీరు పోసి రావి ఆకులను వేసి మరిగించాలి.
మీడియం మంట మీద 10-15 నిమిషాలు ఉడకబెట్టి, ఫిల్టర్ చేయండి.
తర్వాత ఇలా తయారు చేసిన ఈ గోరువెచ్చని నీళ్లు తాగాలి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహాలు సూచనలు పాటించాలి. కొన్ని పదార్థాలు శరీరానికి హాని కలిగించవచ్చు. ప్రాణాలు కూడా హరించవచ్చు. కాబట్టి.. ఇలాంటి చిట్కాలను డాక్టర్ సలహా లేకుండా పాటించవద్దు. పలు పరిశోధనలు.. అధ్యయనాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిట్కాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.