BigTV English

OTT Movie : లవర్ ని చంపే ప్రియుడు భర్తను చంపే భార్య ఇద్దరూ ఒక్కటైతే…. కేక పుట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : లవర్ ని చంపే ప్రియుడు భర్తను చంపే భార్య ఇద్దరూ ఒక్కటైతే…. కేక పుట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను మూవీ లవర్స్ చూసి ఎక్కువగా థ్రిల్ అవుతారు. సస్పెన్స్ సినిమాలు మొదటినుంచి చివరి దాకా ట్విస్టులతో అలరిస్తాయి. ఈ సినిమాలో ఉండే మెయిన్ పాయింట్ ని చివరలో చూపించి సస్పెన్స్ కి తెరదించుతారు. అంతవరకు ప్రేక్షకులను టెన్షన్ పెట్టిస్తాయి ఈ సినిమాలు. అలా టెన్షన్ పెట్టించే ఒక మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? వివరాల్లోకి వెళితే….


నెట్ఫ్లిక్స్ (Netflix)

ఇప్పుడు మనం చెప్పుకోబోయే బాలీవుడ్ మూవీ పేరు ‘మేరీ క్రిస్మస్‘ (Merry Christmas). 2024 లో హిందీలో విడుదలైన ఈ సినిమాకు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించాడు. విజయ్​ సేతుపతి, కత్రినా కైఫ్, అశ్విని కల్సేకర్, రాధిక ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను 2024 జనవరి 12న విడుదల చేశారు. ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ఆల్బర్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఒక హోటల్ కి వెళ్తాడు. అక్కడ ఆల్బర్ట్ కి మరియా పరిచయం అవుతుంది. వీళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. ఆల్బర్ట్ తన గతంలో ఒక అమ్మాయిని ప్రేమించి ఉంటాడు. ఆమె కూడా ఆల్బర్ట్ ని ప్రేమిస్తుంది. అయితే ఆమెకు ఇదివరకే పెళ్లి అయ్యి ఉంటుంది. ఆల్బర్ట్ ని ప్రేమించిన ఆ అమ్మాయి చివరికి మళ్ళీ తన భర్త దగ్గరికి వెళ్ళిపోతుంది. తనకు జరిగిన ఈ స్టోరీని మరియాకి చెప్తాడు ఆల్బర్ట్. అయితే మరియా కూడా తన స్టోరీని ఆల్బర్ట్ కి చెప్తుంది. తన భర్త డ్రగ్స్ కి అలవాటు పడి మమ్మల్ని పట్టించుకోవట్లేదని, వేరొక అమ్మాయితో అతను రిలేషన్ లో ఉన్నాడని చెప్తుంది. నేను కూడా ఎందుకు రిలేషన్ లో ఉండకూడదని, ఒక వ్యక్తిని ఈ హోటల్ కి రమ్మని చెప్పానని చెప్తుంది. అయితే నా కూతుర్ని నన్ను చూసి అతను వెళ్ళిపోయాడని చెప్తుంది. వీళ్ళిద్దరూ నడుచుకుంటూ మరియా ఇంటికి వెళ్తారు. ఆల్బర్తో వైన్ తాగుతూ డాన్స్ వేస్తుంది. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ బయట కాసేపు తిరిగి మళ్లీ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మరియా భర్త గన్ తో కాల్చుకొని చనిపోయి ఉంటాడు.

ఆల్బర్ట్ తన గతంలో చెప్పిన స్టోరీ కొంత నిజం, కొంత అబద్ధం. ఆల్బర్ట్ ప్రియురాలు తనని యాక్సెప్ట్ చేయలేదని ఆమెను చంపేసి జైలుకు వెళ్లి వస్తాడు. ఇప్పుడు పోలీసులకు ఇద్దరం ఒక విషయం మీద నిలబడి ఉండాలని ఆమెకు గైడెన్స్ ఇస్తాడు ఆల్బర్ట్. వీళ్లు అల్లిన కథ విని అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని కన్ఫామ్ చేసుకుంటారు పోలీసులు. అయితే అందులో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఇది మర్డర్ అని గట్టిగా నమ్ముతుంటాడు. మరోవైపు ఆ మర్డర్ ని మరియానే చేసి ఉంటుందనే విషయం ఆల్బర్ట్ గ్రహిస్తాడు. ఎందుకు అతన్ని చంపావని ఆమెను అడుగుతాడు ఆల్బర్ట్. అప్పుడు ఆమె తన కూతురికి జరిగిన అన్యాయం గురించి చెబుతుంది. అందువల్లనే అతన్ని చంపాలనుకున్నానని అంటుంది. చివరికి పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేస్తారా? మరియా తన భర్తను ఎలా చంపింది? ఆల్బర్ట్ ఈ కేసు నుంచి తప్పించుకుంటాడా? మరియా కూతురికి జరిగిన అన్యాయం ఏమిటి? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూడాల్సిందే.

Related News

OTT Movie : ఊరికి దూరంగా విల్లా… యవ్వనాన్ని కాపాడుకోవడానికి మంత్రగత్తె అరాచకం… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : అమ్మాయంటే పడి చచ్చే సోఫా… అబ్బాయిలు చెయ్యేస్తే చావే… ఇదెక్కడి దిక్కుమాలిన చేతబడి భయ్యా ?

OTT Movie : అమ్మాయిని వదలకుండా… సొంత తండ్రి నుంచి అద్దెకిచ్చిన ఓనర్ దాకా… క్లైమాక్స్ కి పిచ్చోళ్ళయిపోతారు మావా

OTT Movie : భార్య ఉండగా పెళ్ళైన మాజీ గర్ల్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా… పక్క అపార్ట్మెంట్లోకి మారి ఆమె చేసే పనికి దిమాక్ ఖరాబ్

OTT Movie : నవ్వుతూ చంపే మిస్టీరియస్ వ్యక్తి… డబ్బు కోసం వెళ్లి అడ్డంగా బుక్కయ్యే అమాయకుడు… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్

OTT Movie : HIV ఎక్కించి అమ్మాయిల్ని చంపే సైకో… ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన సామీ ?

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

Big Stories

×