
Virupaksha : సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన మిస్టికల్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. సంయుక్తా మీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు.
ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ రిలీజై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో విరూపాక్షను పాన్ ఇండియా మూవీ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హీరో సాయి ధరమ్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాడు.
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘‘‘విరూపాక్ష’ సినిమా సక్సెస్ నాదో, మా టీమ్‌దో కాదు. మన ఆడియెన్స్‌ది. గత ఏడాది కొన్ని సినిమాలకు జనాలు రాలేదు. ఎందుకంటే వాళ్లు మాకు చాలెంజ్ విసిరారు. మేం థియేటర్స్‌కు రావాలంటే అలాంటి సినిమాలు మీరు చేయండని చెప్పారు. ఆ చాలెంజ్‌కి ఆన్సరే విరూపాక్ష. దయచేసి అందరూ థియేటర్‌కి వచ్చి సినిమా చూడండని రిక్వెస్ట్ చేస్తున్నాను.
ఈ సినిమా మన ఫిల్మ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇది. సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్. పప్పుగారు డబ్బింగ్ విషయంలో ఎంతగానో హెల్ప్ చేశారు. నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు సాయంగా నిలబడిన డాక్టర్స్‌కి థాంక్స్. వారు నా జీవితాన్ని నాకు తిరిగి ఇచ్చారు. మా ముగ్గురు మావయ్యలకు థాంక్స్. మారుతిగారికి, గోపన్నగాకు థాంక్స్. మీడియా కూడా ఎంతో కీలకంగా వ్యవహరించింది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను తీసుకెళ్లటానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
మరి విరూపాక్ష తెలుగులో సక్సెస్ అయినట్లే అన్ని భాషల్లో సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ.28 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు నిర్మాతలు ప్రకటించారు.