BigTV English
Advertisement

Nani : ఆ దెబ్ట‌కు భ‌య‌ప‌డ్డ నాని.. రెండు నెల‌లు ప‌ట్టిందంటున్న నేచుర‌ల్ స్టార్‌

Nani : ఆ దెబ్ట‌కు భ‌య‌ప‌డ్డ నాని.. రెండు నెల‌లు ప‌ట్టిందంటున్న నేచుర‌ల్ స్టార్‌
Nani

Nani : నేచుర‌ల్ స్టార్ నాని త‌న 29వ సినిమాగా ద‌స‌రా సినిమాను చేసిన సంగ‌తి తెలిసిందే. ఇది పాన్ ఇండియా మూవీ. ఐదు భాష‌ల్లో రిలీజ్ అవుతుంది. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా మార్చి 30న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సినిమాను ప్ర‌మోట్ చేసుకోవ‌టంలో నాని ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ద‌స‌రా సినిమా షూటింగ్ స‌మ‌యంలో తాను భ‌య‌ప‌డ్డ ఘ‌ట‌న గురించి చెప్పి, అదొక పీడ‌క‌ల అని చెప్ప‌టం గ‌మ‌నార్హం. అస‌లేం జ‌రిగింది. నాని ఎందుకంత‌గా భ‌య‌డ్డాడ‌నే వివ‌రాల్లోకి వెళితే..


నాని మాట్లాడుతూ ‘‘ద‌స‌రా సినిమా పాట‌ను షూట్ చేస్తున్న‌ప్పుడు కోల్ ఉన్న డంపర్‌లో కోల్ ఉంటుంది. అది కోల్‌ను పోస్తుంటే కోల్‌తో పాటు హీరో కూడా జారుతూ కింద‌కు దిగాలి. అది సీన్‌. అందులో భాగంగా సింథ‌టిక్ కోల్‌ను త‌యారు చేశారు. డంప‌ర్‌లో వేశారు. సింథ‌టిక్ కోల్‌తో పాటు విప‌రీత‌మైన డ‌స్ట్ ఉంది. షూటింగ్ నేను లారీపైకి ఎక్కాను. కోల్‌తో పాటు కింద‌కు జారే క్ర‌మంలో డంప‌ర్‌లో ఉండే కోల్ అంతా నాపై ప‌డిపోయింది. నేను దాని కింద ఉండిపోయాను. దాన్నంతా తొల‌గించి కానీ.. న‌న్ను బ‌య‌ట‌కు లాగ‌లేరు. కాబ‌ట్టి యూనిట్ స‌భ్యులు కోల్‌, డ‌స్ట్‌ను క్లియ‌ర్ చేసి న‌న్ను బ‌య‌ట‌కు లాగారు. కానీ ఆలోపు డ‌స్ట్ అంతా లోప‌ల‌కి వెళ్లిపోయింది.

దాంతో నాకు స‌రిగ్గా నిద్ర ప‌ట్టేది కాదు.. లోప‌ల ఏదో ఉండిపోయిన‌ట్లుగా అనిపించేది. త‌ర్వాత ఆ ప్రాబ్ల‌మ్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి రెండు నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. అదొక పీడ‌క‌ల‌గా అనుకుంటాను’’అన్నారు. ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించింది. సుధాక‌ర్ చెరుకూరి సినిమాను నిర్మిస్తున్నారు. తెలంగాణలోని గోదావరి ఖని బ్యాక్ డ్రాప్‌లో దసరా సినిమాను రూపొందించారు. దీని కోసం 22 ఎకరాల్లో భారీ విలేజ్ సెట్‌ను వేసి మరీ షూటింగ్ చేశారు.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×