BigTV English

Lottery: భార్య అలిగింది.. 16 కోట్ల లాటరీ తగిలింది.. అసలేం జరిగింది?

Lottery: భార్య అలిగింది.. 16 కోట్ల లాటరీ తగిలింది.. అసలేం జరిగింది?

Lottery: అలక మంచే చేసింది. పెద్ద లాభమే తీసుకొచ్చింది. భార్యలంటే అలక్కుండా ఉంటారా? చిన్న సాకు దొరికితే చాలు.. అలకపాన్పు ఎక్కేస్తారు. ఆమె కూడా అలానే చేసింది. భార్య అలక తీర్చడానికి ఆ భర్త ఆమె పేరు మీద రెండు లాటరీ టికెట్లు కొన్నాడు. అంతే. జాక్‌పాట్ తగిలింది. రెండు లాటరీ టికెట్లకూ నగదు బహుమతి వరించింది. ఏకంగా 16 కోట్లు వచ్చి పడ్డాయి. సుడి అంటే వాళ్లదే.


ఆ జంటకి పెద్ద లాటరీ హిస్టరీనే ఉంది. 30 ఏళ్లుగా ఆ కపుల్.. లాటరీ టికెట్స్ కొంటున్నారు. రెండంటే రెండే కొంటారు. ఒకటి భార్య పేరు మీద, ఇంకోటి భర్త పేరు మీద. అలా రెగ్యులర్‌గా కొంటూనే ఉన్నారు. కానీ, ఇన్నేళ్లకు వారికి ఒక్కసారి కూడా లాటరీ తగల్లేదు. వారి తలరాత మారలేదు. అయినా, టికెట్లు కొనడం మానలేదు.

విసుగెత్తిన ఆ భార్య ఇటీవల తన పేరు మీద మాత్రమే లాటరీ కొన్నాడు. డబ్బులు వేస్ట్ అనుకున్నాడో ఏమో.. భార్య పేరు మీద లాటరీ టికెట్ కొనలేదు. ఈ విషయం తెలిసి భార్య అలిగింది. బుంగమూతి పెట్టింది. భార్య అలిగితే ఎలా ఉంటుందో తెలుసుగా? ఆ టార్చర్ తట్టుకోలేక ఈసారి భార్య పేరు మీద రెండు టికెట్లు కొన్నాడు. భార్య అలక అలా తీర్చాడు.


కట్ చేస్తే.. వన్ ఫైన్ మార్నింగ్ లాటరీ నెంబర్ చెక్ చేశాడు. దిమ్మతిరిగిపోయింది ఆ భర్తకు. తన భార్య పేరు మీద కొన్ని రెండు లాటరీ టికెట్లకూ బహుమతి వచ్చింది. ఒక్కో టికెట్‌కు సుమారు 8 కోట్లు. అలా రెండు టికెట్లకు కలిపి.. దాదాపు 16 కోట్లు గెలుచుకున్నాడు. గిల్లి చూసుకుంటే కానీ నమ్మలేక పోయాడు తమకు లాటరీ తగిలిందనే నిజాన్ని. వెంటనే మేటర్ భార్యకు చెప్పాడు. ఆమె ఎగిరి గంతేసి.. గట్టిగా భర్తకు ముద్దు పెట్టింది.

ఇలా, ఆస్ట్రేలియా న్యూ సౌత్‌ వేల్స్‌కు చెందిన ఆ జంట రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోయారు. భార్య అలకే తమకు లాటరీ తెచ్చిపెట్టిందంటూ ఆ భర్త తెగ మురిసిపోతున్నాడు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×