
Rashmika Mandanna : రీసెంట్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సోషియల్ మీడియాలో చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. నెట్ లో తీవ్ర దుమారం రేపడమే కాకుండా.. అందరినీ షాక్ గురిచేసింది ఈ వీడియో. క్యూట్ బ్యూటీ రష్మిక చాలా హాట్ గా కనిపించడంతో వీడియో సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయింది. మొదట్లో అందరూ ఇది నిజంగా రష్మిక వీడియోనే అని అనుకున్నారు.. వీడియో అంత నాచురల్ గా ఉంది మరి.
రష్మిక వీడియో అంటూ ఆన్లైన్ లో వైరల్ అయిన వీడియో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ది అని కన్ఫర్మ్ అయింది.ఆమె వీడియోకు ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా రష్మిక ఫేస్ ను యాడ్ చేసి విడుదల చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోను చూసి ఇది డీప్ ఫేక్ వీడియో అని మరొక నెటిజన్ స్పందించడంతో అసలు విషయం బయటపడింది. విషయం తెలిసిన సెలబ్రిటీలు సైతం షాక్ అయ్యారు. ఇలాంటి టెక్నాలజీలు మంచి కోసం ఉపయోగించాలి తప్ప ఇలా పక్కన వారిని ఇబ్బంది పెట్టడానికి కాదు.
కొంతమంది ఆకతాయిలు ఇటువంటి టెక్నాలజీని ఉపయోగించి అసాంఘికమైన చర్యలకు పాల్పడుతున్నారు. దీనివల్ల ఎందరో జీవితాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే రంగంలోకి దిగిన సెలబ్రిటీలు అందరూ రష్మికకు సపోర్ట్ ఇచ్చారు. బాలీవుడ్ బిగ్ బి తో సహా అందరూ ఇటువంటి చర్యల పై తీవ్రంగా ధ్వజమెత్తారు. దీనితో పాటుగా రష్మిక ఎమోషనల్ అవుతూ పెట్టిన ట్వీట్ అభిమానులను బాగా టచ్ చేసింది.
ఫైనల్ గా ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో.. ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ రష్మిక ఫేక్ వీడియో పై కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో చేపట్టిన దర్యాప్తులో వీడియో వెనుక ఉన్న అసలు నేరస్థుడు బయటపడ్డాడు. రష్మిక డీప్ ఫేక్ వీడియోకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఒక యువకుడ్ని అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. విచారణలో భాగంగా బీహార్ కు చెందిన 19 ఏళ్ల ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు సోషల్ మీడియాలో మొదట ఆ వీడియోని అప్లోడ్ చేసింది ఆ యువకుడే అన్న అనుమానంతో ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు.