Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. దిల్ రాజు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ వైపు అభిమానులు, మరోవైపు సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
సంక్రాంతి కానుకగా జనవరి 10 న గేమ్ ఛేంజర్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు మేకర్స్. ఇక ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు చేయని ప్రమోషన్స్ .. గేమ్ ఛేంజర్ కు చేస్తున్నాడు దిల్ రాజు. ఇప్పటికీ ఈ సినిమా ట్రైలర్ ను లక్నోలో రిలీజ్ చేసి కొత్త అధ్యాయానికి నాంది పలికారు. గేమ్ ఛేంజర్ ను చూసే పుష్ప 2 ట్రైలర్ ను పాట్నాలో రిలీజ్ చేసినట్లు వార్తలు వినిపించిన విషయం కూడా విదితమే.
Nayanthara: నయన్ కు ఇంతకుమించిన అవమానం ఇంకొకటి లేనట్టే.. అసలేం జరిగిందంటే.. ?
ట్రైలర్ కోసం రాష్ట్రాన్ని దాటించిన శంకర్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏకంగా దేశాన్నే దాటించాడు. అవును.. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇండియాలో కాదు అమెరికాలో జరుగుతుంది. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 21న అమెరికాలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా జరగనున్నట్లు మేకర్స్ తెలిపారు. కర్టిస్ కల్‌వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, గార్‌లాండ్ టి.ఎక్స్ 75040 వేదికగా ఈ ఈవెంట్ జరగనుంది. చిత్ర యూనిట్‌తో పాటు ప్రముఖులందరూ ఈ వేడుకకి హాజరుకాబోతున్నట్లు సమాచారం.
ఒక తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. అమెరికాలో జరగడం ఇదే మొదటిసారి కానునుండడంతో మెగా ఫ్యాన్స్ కలర్ ఎగురవేస్తున్నారు. ఛరిష్మా డ్రీమ్స్‌పై ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్‌గా ఇండస్ట్రీ, యు.ఎస్ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిటర్ సర్కిల్‌లో, ఎంట్రప్రెన్యూరర్‌గా బిజినెస్ సర్కిల్‌లో గుర్తింపు సంపాదించుకున్న రాజేష్, యు.ఎస్‌లో ఓ తెలుగు సినిమాకు ఇప్పటి వరకు జరగలేదు..జరగబోదు అనేంత భారీ స్థాయిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు. మరి ఈ వేడుక ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలంటే డిసెంబర్ 21 వరకు ఆగాల్సిందే.
'Mega MASS'ive Event in the USA 🇺🇸 💥
The pre-release event of #GameChanger will happen in the USA – the first time ever for an Indian cinema ❤️🔥
📍 Curtis Culwell Center, 4999 Naaman Forest Garland TX 75040
🗓️ 21st DEC, 6:00 PM ONWARDSSee you soon, America!
Event by… pic.twitter.com/rcjVCrDGOX— Game Changer (@GameChangerOffl) November 22, 2024