E-Paper
Advertisement

Kalki 2898AD: ఇదెక్కడి మాస్ రా మావా.. కేవలం సమోసాల వలనే రూ.150 కోట్లా..?

Kalki 2898AD: ఇదెక్కడి మాస్ రా మావా.. కేవలం సమోసాల వలనే రూ.150 కోట్లా..?
Advertisement

Kalki 2898AD: ఏంటి.. నిజమా.. కల్కి సినిమా టికెట్స్ కన్నా సమోసాల వలనే ఎక్కువ లాభం వచ్చిందా.. ? అంటే నిజమే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఒక్కో థియేటర్ కోటి వరకు లాభాలను అందుకున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి2898 AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా కనిపించగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ గా కనిపించాడు.

ఎన్నో అంచనాల నడుమ జూన్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రికార్డు కలక్షన్స్ రాబడుతుంది. ఇప్పటివరకు కల్కి ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్ల మార్క్‌ ను దాటేసింది. ఇక ఆగస్టు 2 నుంచి 9 వరకు మేకర్స్ ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ఇస్తూ టికెట్ రేట్ తగ్గించడంతో.. థియేటర్స్ ఇంకా ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఈ రష్ ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు.

Advertisement

ఇక ఇదంతా పక్కన పెడితే.. కల్కి సినిమా వలన థియేటర్ యాజమాన్యం కోట్లు సంపాదించుకున్నారు. వారికి టికెట్స్ వలన వచ్చిన లాభం కంటే సమోసాలు అమ్మడం వలన వచ్చిన లాభమే ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు. ఒక్కో థియేటర్ లో కల్కి సినిమా పుణ్యమా అని 1 కోటి బిజినెస్ అయ్యిందని సమాచారం. ముఖ్యంగా మల్టిఫ్లెక్స్ లు అయినా ఏషియన్, పీవీఆర్ లు అయితే ఏకంగా 60 శాతం లాభాలు ఫుడ్ మీదనే వచ్చాయి.

పీవీఆర్ ఇప్పటివరకు ఈ ఫుడ్ వలనే రూ.150 కోట్లు.. ఏషియన్ రూ.50 కోట్లు సంపాదించిందని టాక్ నడుస్తోంది. అందులో టికెట్స్ వలన వచ్చింది 40 శాతం మాత్రమే. మిగతా 60 శాతం సమోసాలు వలన వచ్చిందే. నమ్మబుద్ది కావడం లేదు కదా. సాధారణంగా.. బయట తినే ఫుడ్ కన్నా మల్టిఫ్లెక్స్ లో ఫుడ్ కాస్ట్ చాలా ఎక్కువ.

Advertisement

కల్కి సినిమాకు కుటుంబాలతో సహా రావడంతో.. విరామ సమయంలో స్నాక్స్ రేటును పెంచేసి అమ్మడం, బయటకు వెళ్లి తినే అప్షన్ లేకపోవడంతో వేరే గత్యంతరం లేక అక్కడే ఎంతరేటు అయినా తీసుకుంటున్నారు. సినిమా టికెట్ రేటు కన్నా.. అక్కడ తినే ఫుడ్ కే రేటు ఎక్కువ. అందుకే.. టికెట్స్ వలన మల్టీప్లెక్స్ లకు వచ్చే లాభాల కన్నా ఫుడ్ వలన వచ్చే లాభాలే ఎక్కువ. ఈ విషయం తెలియడంతో అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×