The Raja Saab Release Date: బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయిన సంగతి తెలిసిందే. ఏ ముహూర్తాన ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి సినిమా తెరకెక్కించాడో కానీ అప్పటినుండి తెలుగు సినిమా స్థాయి కూడా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాల కోసం ఆడియన్స్ ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇక ప్రభాస్ విషయానికొస్తే బాహుబలి తర్వాత ఇప్పటివరకు ప్రభాస్ చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలైంది. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా ప్రభాస్ కు మంచి కం బ్యాక్ అయింది. ఆ తర్వాత కల్కి సినిమా దాదాపు 1,000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలలో రాజా సాబ్ సినిమా ముందు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
రాజా సాబ్ సినిమా రిలీజ్ డేట్
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ కొంచెం సీరియస్ మోడ్ లో ఉంటాయి. కానీ ప్రభాస్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ మళ్లీ ఇప్పటివరకు బయటపడలేదు. ఒక సందర్భంలో మారుతి మాట్లాడుతూ నేను ప్రభాస్ తో సినిమా చేస్తే డార్లింగ్, బుజ్జిగాడు కైండ్ ఆఫ్ సినిమా చేస్తాను అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు. ఇక రాజా సాబ్ సినిమా విషయానికి వస్తే ప్రభాస్ లోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ బయటకు తీసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు సినిమాలో హర్రర్ కూడా ఉంటుంది. ఈ సినిమాను సంక్రాంతి సీజన్లో విడుదల చేద్దామని ముందు ఫిక్స్ అయ్యారు. కానీ ఇదివరకే ఐదు సినిమాలు సంక్రాంతి వస్తున్నట్లు అనౌన్స్ చేశాయి. అందుకే ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నట్లు విశ్వసినీయ వర్గాల సమాచారం.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ సినిమా
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌస్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. దాదాపు 50 సినిమాలకు దగ్గరగా ఉంది ఈ నిర్మాణ సంస్థ. అయితే ఇప్పటివరకు ఈ నిర్మాణ సంస్థలో వచ్చిన హైయెస్ట్ బడ్జెట్ సినిమాల్లో రాజా సాబ్ ఒకటి. ఈ బ్యానర్ లో ఎన్నో సినిమాలు వచ్చినా గాని చెప్పుకోదగ్గ గట్టి సినిమా అయితే ఇప్పటివరకు లేదు. బహుశా ఆ పేరు ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇకపోతే రాజా సాబ్ సినిమాతో పాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 సినిమా కూడా డిసెంబర్లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. అయితే ఈ రెండింటి గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సిఉంది.
Also Read : Janasena Atthi Satyanayana: నాకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం… నన్ను దిల్ రాజు ఇరికించాడు