The Rajasaab: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని ప్రభాస్ ఫాన్స్ పాటలు పాడేసుకొనే సమయం వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ది రాజాసాబ్ ఒకటి. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి ఆగర్వాల్ తో పాటు మరో ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు.
కామెడీ హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డబుల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఎప్పటి నుంచి సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సిన సినిమా.. వాయిదాలు పడుతూ వస్తుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
రాజాసాబ్ ఆ రోజు వస్తుంది.. ఈరోజు వస్తుంది అని చెప్పుకోవడమే తప్ప ఇప్పటివరకు మరో రిలీజ్ డేట్ ను ఇంకా ప్రకటించలేదు. ఎప్పటినుంచో రాజాసాబ్ డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది అని వార్తలు వస్తున్నాయి. ఇక నేడు అందరు అనుకున్న విధంగానే డిసెంబర్ 5 న ది రాజాసాబ్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో పాటు ఈ సినిమా టీజర్ జూన్ 16 న ఉదయం 10. 52 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలుపుతూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ప్రభాస్ బ్లాక్ కట్ బనియన్ తో కనిపించాడు. డార్లింగ్ లుక్ చాలా బావుంది. వింటేజ్ లుక్ లో ప్రభాస్ మరింత అందంగా కనిపించాడు. ఇక ఎట్టకేలకు రాజాసాబ్ రిలీజ్ డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి రాజాసాబ్.. ఆ అంచలనాలను అందుకుంటుందా.. ? ప్రభాస్.. ఫ్యాన్స్ కు మంచి హిట్ సినిమా ఇస్తాడా.. ? అనేది చూడాలి.