Ee Sala Cup Namde: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament) చివరి దశకు వచ్చేసింది. ఒకే ఒక్క మ్యాచ్ పూర్తయితే ఛాంపియన్ ఎవరు అనేది తేలిపోతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అలాగే పంజాబ్ కింగ్స్ ( Royal Challengers Bengaluru vs Punjab Kings, Final) తలపడుతున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium in Ahmedabad) వేదికగా ఈ బీకర ఫైట్ జరగబోతోంది. ఇలాంటి నేపథ్యంలో ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా రాయల్ చాలెంజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగనున్న ఫైనల్ కోసం ఎదురుచూస్తున్నారు.
Also Read: Shreyas Iyer : మీరు నా ముందు పిల్ల బచ్చాలు… ముంబైని అవమానించిన అయ్యర్.. చూయింగ్ గమ్ ఉమ్మేస్తూ
RCB కోసం రంగంలోకి ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో… రంగంలోకి ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ( DK SHIVA KUMAR) దిగారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న డీకే శివకుమార్…. ఈ సారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధిస్తుందని అంచనా వేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా ఓ వీడియో పోస్ట్ చేశారు డీకే శివకుమార్. రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా ఉన్న డీకే శివ కుమార్…. రాయల్ చాలెంజెస్ బెంగళూరు అభిమాని అన్న సంగతి తెలిసిందే.
తమ రాష్ట్రానికి సంబంధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలవాలని… ఈసారి కచ్చితంగా టైటిల్ మనదే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తమ విజయాన్ని ఎవరు ఆపలేరని… 18 సంవత్సరాల తర్వాత టైటిల్ గెలవబోతున్నట్లు వీడియో ద్వారా ప్రకటించారు డీకే శివకుమార్. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రాయల్ చాలెంజెస్ బెంగళూరు అభిమానులకు శుభవార్తలు చెప్పారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ మ్యాచ్ గెలవాలని కూడా అందరూ కోరాలని… ఏకం కావాలని రిక్వెస్ట్ చేశారు డీకే శివకుమార్. అలాగే ఎప్పుడు వినిపించే ఈసాల కప్ నమ్దే ( Ee Sala Cup Namde) అంటూ ఆయన కూడా డైలాగ్ వేశారు. దీంతో డీకే శివకుమార్ పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు…. వెంటనే రియాక్ట్ అవుతున్నారు.
బెంగళూరు అభిమానుల రచ్చ
డీకే శివకుమార్ వీడియో పెట్టడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. మీరు రంగంలోకి దిగినాక… కచ్చితంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఫైనల్ మ్యాచ్లో కచ్చితంగా పంజాబ్ కింగ్స్ జట్టు ఓడిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
Ee Sala Cup Namde! ♥️🏆
18 years of grit.
Every prayer, every cheer, every heartbreak – it all leads to today.
This is more than a match.
Our moment. Our Cup.
Wishing @RCBTweets the very best – Karnataka is with you!#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/cTmRhjgjts— DK Shivakumar (@DKShivakumar) June 3, 2025