BigTV English

Aay Movie: అయ్యా బాబోయ్.. ఆయ్ కలక్షన్స్ చూసారా.. అదిరిపోయాయండీ బాబు

Aay Movie: అయ్యా బాబోయ్.. ఆయ్ కలక్షన్స్ చూసారా.. అదిరిపోయాయండీ బాబు

Aay Movie: తెలుగు ఇండస్ట్రీ అంతకు ముందులా లేదు. స్టార్ హీరోలు, అభిమాన హీరోలు.. సినిమాలు రిలీజ్ అయితే కథ బాగోకపోయినా ప్రెస్టేజ్ కోసం బావుంది అని చెప్పుకొనే ఫ్యాన్స్ ఇప్పుడు లేరు. కథ నచ్చితే.. అది ఎంత చిన్న సినిమా అయినా హిట్ అందిస్తున్నారు. కథ నచ్చకపోతే స్టార్ హీరోలను అయినా వెనక్కి  పంపించేస్తున్నారు. ఇది టాలీవుడ్ కు శుభశకునమనే చెప్పాలి.


గత కొన్నేళ్లుగా చిన్న సినిమాలు  బాక్సాఫీస్ వద్ద తమ సత్తాను చాటుతున్నాయి. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయని, భయపడి వెనక్కి తగ్గకుండా కథలో బలం ఉంది.. కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది అని నమ్మి.. చిన్న సినిమాలు సైతం పోటీకి సై అంటున్నాయి. అలా  ఒక చిన్న సినిమాగా.. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడింది ఆయ్ మూవీ.

నార్నే నితిన్,  నయన్ సారిక జంటగా అంజి కే. మణిపుత్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆయ్. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ.. ఆగస్టు 15 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ తో పోటీపడి.. విన్నర్ గా నిలిచింది.


అచ్చ తెలుగు సినిమాగా నవ్వించి, ఏడిపించి.. ఎన్నో జ్ఞాపకాలను గుర్తుచేసి, చివరకు తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని ఎంతో అద్భుతంగా చూపించిన తీరు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. మంచి విజయాన్నే కాదు రికార్డ్ కలక్షన్స్ ను కూడా అందుకొని షాక్ ఇస్తుంది.  ఆయ్ మూవీ 7 రోజుల్లో 9.25 కోట్ల రూపాయల వసూళ్లను అందుకొని షాక్ ఇచ్చింది.

చిన్న సినిమాకు ఇన్ని కలక్షన్స్ అంటే మాములు విషయం కాదు. ఇంకా ఈ సినిమా థియేటర్లో విజయవంతంగా కొనసాగుతుంది. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ హక్కులను ఆహా సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడప్పుడే ఈ సినిమా ఓటీటీలో వచ్చే దాఖలాలు కనిపించడం లేదు. ఆగస్టు 29 న సరిపోదా శనివారం వచ్చేవరకు.. ఒకపక్క ఆయ్.. ఇంకోపక్క కమిటీ కుర్రోళ్లు ప్రేక్షకులను అలరిస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ముందు ముందు ఆయ్ ఎంత వసూల్ చేస్తుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×