BigTV English

Khadgam Movie Sangeetha Character: ఖడ్గం సినిమాలో సంగీత చేసిన క్యారెక్టర్ ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్

Khadgam Movie Sangeetha Character: ఖడ్గం సినిమాలో సంగీత చేసిన క్యారెక్టర్ ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్

The star heroine who missed the key role in Khadgam movie


The star Heroine Who Missed The Key Role in Khadgam Movie: ఖడ్గం మూవీ టాలీవుడ్‌లో రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ కృష్ణవంశీ డిఫరెంట్ జోనర్‌లో దేశభక్తి ఉట్టిపడేలా ఈ మూవీని తెరకెక్కించాడు. ఇదిలా ఉంటే.. ఈ మూవీలో నటి సంగీత రోల్‌ని ముందుగా ఓ అగ్రహీరోయిన్‌ని సంప్రదించారట డైరెక్టర్ కృష్ణవంశీ. కానీ ఆ హీరోయిన్ నో చెప్పిందట. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా, అయితే ఆవిడ ఎవరో తెలియాలంటే వాచ్‌ దిస్ స్టోరీ.

ఖడ్గం మూవీ 2002లో రిలీజ్ అయింది. దేశభక్తి ప్రధానంగా ఈ చిత్రంలో చూడవచ్చు. ఇందులో నటీనటులుగా హీరోలు శ్రీకాంత్, రవితేజ, నటులు ప్రకాష్ రాజ్, షఫీ, హీరోయిన్లు సోనాలి బెంద్రే, సంగీత, కిమ్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సుంకర మధుమురళి కార్తికేయ మూవీస్ బ్యానర్‌పై నిర్మించాడు. కృష్ణవంశీ, ఉత్తేజ్, సత్యానంద్ రచన చేశారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. నవంబరు 29, 2002 లో విడుదలైన ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌తో ఘనవిజయాన్ని సాధించింది. అంతేకాదు ఈ మూవీకి గానూ ఐదు నంది పురస్కారాలను అందుకున్నారు.


Read More: హీరో అల్లు అర్జున్‌పై నటి సమంత షాకింగ్ కామెంట్స్

ఈ మూవీ స్టార్ట్ అయిన రోజుల్లో మొదటగా డైరెక్టర్ సాక్షి శివానంద్‌ని అనుకున్నారట. కానీ ఈ రోల్‌ని ఆమె రిజక్ట్ చేయడంతో ఆమె స్థానంలో సంగీతను ఎంచుకున్నారట డైరెక్టర్. అంతేకాదు ఆ పాత్రని రిజెక్ట్ చేసిన సాక్షి శివానంద్‌ శ్రీకాంత్‌ లవర్‌ రోల్ అయితే చేస్తానని చెప్పిందట. సోనాలి బెంద్రే రోల్‌ తనకు ఎంతో బాగా నచ్చిందని తెలిపిందట. ఈ క్యారెక్టర్‌కి ఫస్ట్ నుంచి అనుకుంటున్న సోనాలి బెంద్రేని కాదని తనకు ఎలా ఇవ్వమంటావని డైరెక్టర్ చెప్పినట్లు సమాచారం.

ఇక ఈ మూవీ తర్వాత సంగీత హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్‌గా తన మార్కును కొనసాగించింది. సంగీత తాజాగా సెకండ్‌ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసేసింది. పలు మూవీస్‌లోనూ తల్లి క్యారెక్టర్స్ చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. తాజాగా మహేష్‌బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలోనూ హీరోయిన్‌ మథర్ క్యారెక్టర్ చేసి టాలీవుడ్ ఆడియెన్స్‌ని ఎంతగానో మెప్పిందని చెప్పాలి. పలు బుల్లితెర షోలలోనూ జడ్జిగా వ్యవహరిస్తోంది. ఏదేమైనా రానున్న రోజుల్లో మరిన్ని అధ్భుతమైన చిత్రాల్లో నటించాలని మనమంతా కోరుకుందాం.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×