BigTV English

Kuberaa : కుబేరా సక్సెస్ పవన్ కళ్యాణ్ కు ప్లస్ పాయింట్

Kuberaa : కుబేరా సక్సెస్ పవన్ కళ్యాణ్ కు ప్లస్ పాయింట్

Kuberaa : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడం లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఎప్పుడో మొదలైన ఈ ప్రాజెక్ట్ రీసెంట్ టైమ్స్ లో పూర్తవటం. అప్పుడు రాసుకున్న కథకు ఇప్పుడు రోజులకు మార్పులు వచ్చేసాయి. కాబట్టి సినిమా మీద అంతగా ఆసక్తి ఎవరికీ ఉండదు. దాదాపు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఈ విషయంపై ఒక అవగాహనకు వచ్చేసారు. కానీ నిర్మాతలు మాత్రం ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని ప్రచారం చేస్తూ వస్తున్నారు. అందుకే సరైన రేట్ దొరికినంత వరకు కూడా ఈ సినిమాను అమ్మడం లేదు.


థియేటర్స్ ఇష్యూ

వాస్తవానికి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ డిస్ట్రిబ్యూటర్ల ముందుకు రాకపోవడంతో ఈ సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో థియేటర్స్ ఇష్యూ కూడా ఒకటి నడిచింది. ఆ నలుగురు చేతిలో థియేటర్స్ ఉన్నాయనే వార్తలు రావడంతో దాదాపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఇష్యూ పైన స్పందించారు. మరోవైపు ఈ సినిమాకి ఓటిపి నుంచి కూడా ఒత్తిడి వస్తుంది. సినిమా వాయిదా పడడం వలన నమ్మకాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. మొత్తానికి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ను రేపు అధికారికంగా ప్రకటించనుంది చిత్ర యూనిట్. ఈ తరుణంలో కుబేర సక్సెస్ ఈ సినిమాకి ఒక ఉపశమనం కలిగించింది.


కుబేర సక్సెస్ పవన్ కళ్యాణ్ కి ప్లస్

శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో ధనుష్ (Dhanush) నటించిన కుబేర (Kuberaa) సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో పడినప్పటినుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ సినిమాలో చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది సినిమా ఆర్ట్ వర్క్. చాలా వాటిని చాలా అద్భుతంగా చూపించారు తోట తరణి (Thota Tharani). పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకి కూడా హార్ట్ వర్క్ చేసింది తోట తరణి. అయితే కుబేరా లో అతని వర్క్ చూసిన తర్వాత చాలామందికి హరిహర వీరమల్లు సినిమా మీద కొద్దిపాటి నమ్మకాలు పెరుగుతున్నాయి. అలానే ఈ సినిమాలో కొన్ని సీక్వెన్సెస్ గురించి దర్శకుడు కూడా భారీ ఎలివేషన్లు ఇస్తూ వస్తున్నాడు.

Also Read : Shekhar Kammula: వరస్ట్ ఫిలిమ్ తీసిన 11 ఏళ్లకు బ్లాక్ బస్టర్ కొట్టాడు

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×