BigTV English

OTT Movie : బ్రతికుండగానే కాల్చి చంపే గ్రామస్తులు… పగతో ఊరినే వల్లకాడుగా మార్చే అమ్మాయి

OTT Movie : బ్రతికుండగానే కాల్చి చంపే గ్రామస్తులు… పగతో ఊరినే వల్లకాడుగా మార్చే అమ్మాయి

OTT Movie : హారర్ సినిమాలు ఎప్పుడు చూసినా బోర్ కొట్టవు. భయపెట్టే సన్నివేశాలు ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే ఈ సినిమాలలో అటువంటి సీన్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని సినిమాలలో భయపెట్టే సన్నివేశాలతో పాటు, నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇపుడు మనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ కూడా ఇలానే ఉంటుంది. ఇందులో దట్టమైన పొగమంచు, భయంకరమైన జీవులు, సూపర్‌నాచురల్ శక్తులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ సినిమాలో ఒక తల్లి తన కూతురి కోసం సైలెంట్ హిల్‌లో ఉండే సీక్రెట్స్ కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక స్టోరీ సీను సీనుకూ సెగలు పుట్టిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ కెనడియన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘సైలెంట్ హిల్’ (Silent Hill). 2006 లో వచ్చిన ఈ సినిమాకి క్రిస్టోఫ్ గాన్స్ దర్శకత్వం వహించారు. ఇది కొనామి ప్రసిద్ధ వీడియో గేమ్ సిరీస్ ‘సైలెంట్ హిల్’ఆధారంగా రూపొందింది. ఇందులో రాడా మిచెల్, సీన్ బీన్, లారీ హోల్డెన్, డెబోరా కారా ఉంగర్, కిమ్ కోట్స్, జోడెల్ ఫెర్లాండ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఒక సైలెంట్ హిల్ అనే ఫిక్షనల్ అమెరికన్ పట్టణంలో జరిగే ఒక మిస్టరీ-హారర్ కథ. 2 గంటల 5 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి, IMDb లో 6.5/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా Peacock, Amazon Prime Video, Apple TV లలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

రోజ్ డా సిల్వా తన భర్త క్రిస్టోఫర్ తో కలిసి సంతోషకరమైన జీవితం గడుపుతుంటుంది. ఈ జంట షారన్ ను దత్తత తీసుకుని పెంచుతుంది. షారన్ నిద్రలో నడవడం, ‘సైలెంట్ హిల్’ అనే పేరును అరవడం వంటి భయంకరమైన పీడకలలతో బాధపడుతుంది. షారన్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి, రోజ్ ఆమెను సైలెంట్ హిల్ అనే ప్రాంతానికి తీసుకెళ్తుంది. ఇది ఒకప్పుడు బొగ్గు గనుల దగ్గర ఉన్న పట్టణం, కానీ 30 సంవత్సరాల క్రితం ఒక భయంకరమైన అగ్నిప్రమాదం తర్వాత ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. క్రిస్టోఫర్ వీళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకోడు. కానీ రోజ్ షారన్‌ను తీసుకొని ఒంటరిగా వెళ్తుంది.

సైలెంట్ హిల్ సమీపంలో ఒక చిన్న అమ్మాయి కారుకి అడ్డంగా కనిపించడం వల్ల, వీళ్ళు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవుతుంది. రోజ్ స్పృహ కోల్పోతుంది. కాసేపటికి మెలుకువలోకి వచ్చిన రోజ్ కు షారన్ మిస్సింగ్ అయినట్లు తెలుస్తుంది.ఈ ప్రాంతం కూడా దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉంటుంది. రోజ్ షారన్‌ను వెతకడానికి సైలెంట్ హిల్ వీధుల్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఆమె భయంకరమైన జీవులను, అసాధారణమైన శక్తులను ఎదుర్కొంటుంది. ఆమెకు సైబిల్ బెనెట్ అనే ఒక మహిళా పోలీసు అధికారి సహాయం చేస్తుంది, ఆమె కూడా రోజ్‌ను అనుసరిస్తూ సైలెంట్ హిల్‌లో చిక్కుకుంటుంది. సైలెంట్ హిల్‌లో రెండు డైమెన్షన్‌ల మధ్య మారుతూ ఉంటుందని రోజ్ తెలుసుకుంటుంది. ఒకటి పొగమంచు కప్పబడిన రియాలిటీ, మరొకటి “డార్క్‌నెస్” అనే భయంకరమైన ఆల్టర్నేట్ రియాలిటీ.

రోజ్ అక్కడ డహలీయా అనే మహిళను కలుస్తుంది. ఆమె సైలెంట్ హిల్ చీకటి చరిత్ర గురించి రోజ్ కి చెప్తుంది. ఈ ప్రాంతంలో ‘ది ఆర్డర్’ అనే ఒక కల్ట్ సమూహం ఉంటుంది. ఇది క్రిస్టబెల్లా నాయకత్వంలో ఉంటుంది. ఈ కల్ట్ అలెస్సా గిలెస్పీ అనే ఒక చిన్న అమ్మాయిని “మంత్రగత్తె”గా భావించి, 30 సంవత్సరాల క్రితం ఆమెను బ్రతికుండాగానే బలి తీసుకుంది.  దీని ఫలితంగా ఈ ప్రాంతంలో భయంకరమైన అగ్నిప్రమాదం సంభవించింది. అలెస్సా ఆత్మ సైలెంట్ హిల్‌ను శాపగ్రస్తం చేయడం వల్లే అలాజరుగుతుంది. ఇప్పుడు అలెస్సా ఆత్మ షారన్ లోకి చేరింది. ఈ ఆత్మ తిరిగి సైలెంట్ హిల్‌కు పగతీర్చుకునేందుకే వస్తుంది. చివరికి అలెస్సా రివేంజ్ తీర్చుకుంటుందా ? ఆ భయంకరమైన కల్ట్ ను ఎలా ఎదుర్కుంటుంది ? రోజ్ ఈ ఆత్మకి సాయం చేస్తుందా ? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే, ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : నోట్లో అరటి పండు పెట్టి చంపే సైకో… అలాంటి వాళ్లే ఈ కిల్లర్ టార్గెట్

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×