BigTV English

Srinu Vaitla: భలే మోసం చేశావు మావా, వెంకీ సినిమా పేరు అది కాదా.?

Srinu Vaitla: భలే మోసం చేశావు మావా, వెంకీ సినిమా పేరు అది కాదా.?

Srinu Vaitla: ప్రస్తుతానికి ఫామ్ లో లేరు కానీ ఒకప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ల ప్రస్తావన వస్తే కచ్చితంగా వినిపించారు శ్రీను వైట్ల. చాలామంది దర్శకులకు కలగని అదృష్టం శ్రీను వైట్లకి దక్కింది. శ్రీను వైట్ల సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. బాలకృష్ణ మినహాయిస్తే, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ హీరోలతో సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. శ్రీను వైట్ల కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించే ప్రతి టెంప్లెట్ శ్రీనువైట్ల సినిమాలో నుండే వాడుతారు. శ్రీను వైట్ల క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ను అంత ఈజీగా మర్చిపోలేము. ఆ పాత్ర పేరు తెలుసుకుంటే చాలు దానికి సంబంధించిన కామెడీ సీన్స్ అన్నీ కూడా మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా శ్రీను వైట్ల చేసిన వెంకీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక రీసెంట్ గా ఆ సినిమా రీ రిలీజ్ చేసినప్పుడు చాలామంది విపరీతంగా ఎంజాయ్ చేశారు.


కన్నీళ్లు పెట్టుకున్న శ్రీను వైట్ల 

ఇప్పుడు చాలామంది దర్శకులు సరైన సినిమాలు తీయడం లేదు. కానీ ఒకప్పుడు వాళ్లు చేసిన వర్క్ కి ఫిదా అవ్వాల్సిందే. ఇంత మంచి సినిమాను ఎలా చేయగలిగారు అని పలు సందర్భాల్లో అనిపించడం మానదు. వెంకీ సినిమా రీ రిలీజ్ అయినప్పుడు చాలామంది అభిమానులు ఎంజాయ్ చేస్తుంటే థియేటర్లో ఒక మూల నిల్చుని శ్రీనువైట్ల కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన డి సినిమా మరోసారి రి రిలీజ్ అయింది. ఈ తరుణంలో చాలామందికి ఇంటర్వ్యూ ఇచ్చాడు శ్రీను. అలానే తన సినిమాలు గురించి చాలా విషయాలు రివీల్ చేశాడు. అందులో భాగంగానే వెంకీ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు.


వెంకీ టైటిల్ అది కాదు 

శ్రీను వైట్ల రవితేజ కాంబినేషన్లో వచ్చిన వెంకీ , దుబాయ్ శీను సినిమాలు కమర్షియల్ గా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. కానీ ఆ సినిమాలోని కొన్ని సీన్స్ మాత్రం ఇప్పటికే విపరీతంగా నవ్వు తెప్పిస్తాయి. ముఖ్యంగా వెంకీ సినిమాలో సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ సినిమాను షూట్ చేస్తున్నప్పుడు రవితేజ పేరు శీను అని ఫిక్స్ అయ్యారు. అయితే సినిమాలో కూడా చాలా సందర్భాలలో క్యారెక్టర్స్ అన్నీ కూడా శీను శీను అని రవితేజ అని పిలుస్తాయి. సినిమా జరుగుతున్న తరుణంలోనే వెంకీ అనే టైటిల్ పెడితే బాగుంటుంది అని శ్రీను వైట్లకు అనిపించింది. అయితే డబ్బింగ్ లో శీను అనే పేరును వెంకీ అనేలా మార్పించి చెప్పించారు. అంత కామెడీ ఉండడంతో పెద్దగా ఇటువంటి మిస్టేక్స్ ను ఎవరూ నోటీస్ చేయలేదు. అయితే అప్పుడు సినిమా చూసే విధానం ఇప్పుడు సినిమా చూసే విధానం కంప్లీట్ గా మారిపోయింది కాబట్టి తప్పులు వెతకడం మొదలు పెడుతున్నారు. ఏదేమైనా శ్రీనువైట్ల చెప్పినంత వరకు కూడా ఈ విషయం ఎవరికీ తెలియదు.

Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×