Karthik Subbaraj: తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో కార్తీక్ సుబ్బరాజ్ ఒకరు. అయితే కార్తీక్ సుబ్బరాజ్ ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరియర్ ను మొదలుపెట్టాడు. అదే తను దర్శకుడుగా మాత్రం జిగర్తాండ సినిమాతో పరిచయం అవ్వాలని అనుకున్నాడు. కానీ ఆ సినిమా ఎక్కువ బడ్జెట్ కారణంగా మొదట ఆ సినిమాని తెరకెక్కించలేకపోయాడు. చాలా లో బడ్జెట్లో పిజ్జా అనే సినిమాను తెరకెక్కించాడు కార్తీక్ సుబ్బరాజ్.
మొదటి సినిమాతో సక్సెస్
పిజ్జా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో కొద్దిపాటి సంచలనాన్ని సృష్టించింది. కార్తీక్ సుబ్బరాజు టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసిన సినిమా ఇది అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత వచ్చిన జిగిర్తండా సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. సినిమాని ఇలా కూడా తీయొచ్చు అని ప్రూవ్ చేశాడు కార్తీక్ సుబ్బరాజు. ఈ సినిమాతో మణిరత్నం శంకర్ లాంటి దిగ్గజ దర్శకుల ప్రశంసలను కూడా పొందుకున్నాడు.
డిజాస్టర్ సినిమాలకు ఎలివేషన్
ఇకపోతే ప్రస్తుతం ఉన్న యంగ్ దర్శకులని చాలామంది సీనియర్ దర్శకులు ఇన్స్పైర్ చేశారు అనే మాట వాస్తవం. కానీ చాలామంది సీనియర్ దర్శకులు అప్పట్లో ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. ఇప్పుడు కొంతమంది సీనియర్ దర్శకులు చేస్తున్న సినిమాలు చూస్తుంటే, వీళ్లు రిటైర్ అయిపోవడం మంచిదే అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ తరుణంలో కార్తీక్ సుబ్బరాజు మాత్రం ప్రతి సినిమాకి భారీ ఎలివేషన్ ఇస్తున్నాడు. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ 2 సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిన విషయమే. అయితే ఆ సినిమా విషయంలో కూడా శంకర్ కు ఎలివేషన్ ఇచ్చాడు. ఇక తాను స్టోరీ లైన్ అందించిన గేమ్ చేంజెర్ సినిమా రిజల్ట్ కూడా డిజాస్టర్. ఆ సినిమాను కూడా పొగుడుతూ ట్వీట్ వేశాడు. ఇక రీసెంట్ గా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమా థగ్ లైఫ్. ఈ సినిమా మొదటి షో పడిన వెంటనే నెగిటివ్ టాక్ సాధించుకుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి కూడా పాజిటివ్ గా ట్వీట్ చేశాడు. ఇకపోతే రీసెంట్ గానే సూర్య హీరోగా రెట్రో అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు కార్తీక్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కానీ మిగిలిపోయింది. ఇప్పుడు మిగతా సినిమాలను పొగడటం వల్ల కార్తీక్ మీద నెగెటివిటీ పెరుగుతుంది.
Also Read : Mallidi Vassishta : విశ్వంభరా దర్శకుడు, హీరోగా సినిమాలు చేశాడని తెలుసా.?