BigTV English

Coolie in 100 Days : తమిళ సినిమా అంటే భలే హై క్రియేట్ చేస్తాడు ఈ బక్కోడు

Coolie in 100 Days : తమిళ సినిమా అంటే భలే హై క్రియేట్ చేస్తాడు ఈ బక్కోడు

Coolie in 100 Days : కేవలం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఖచ్చితంగా వినిపించే పేర్లలో అనిరుధ్ రవిచంద్రన్ కూడా ఒకటి. త్రీ సినిమాతో ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనిరుద్ అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. కేవలం గుర్తింపు మాత్రమే కాకుండా అనిరుద్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా అనిరుద్ సంగీత దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అంటేనే దానిమీద అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. కొన్ని సినిమాలపై తన మ్యూజిక్ తోనే ఎన్నో అంచనాలను క్రియేట్ చేశాడు అనిరుద్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమాతో తెలుగులో కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. కానీ అనిరుద్ మాత్రం ఆ సినిమాకి మంచి న్యాయం చేశాడు అనే పేరు సాధించుకున్నాడు.


టైటిల్ సాంగ్ తోనే హైప్ 

అనిరుద్ కెరియర్లో ఎన్ని సినిమాలు చేసినా కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఇచ్చిన ఆల్బమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన పెట్ట సినిమాకు సంగీత దర్శకుడుగా పనిచేశాడు అనిరుద్. ఆ సినిమాకి అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. పలు సందర్భాలలో ఇది తలైవా రజినీకాంత్ ఫ్యాన్స్ కు ఈ ఆల్బమ్ ను డెడికేట్ చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు కార్తీక్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాలకు కూడా అనిరుద్ సంగీతం అందిస్తుంటాడు. మీరు ఒక సాంగ్ అప్డేట్ ఇవ్వాలన్నా కూడా చాలా క్రేజీ వీడియోను ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం లోకేష్ దర్శకత్వం వహిస్తున్న కూలీ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు అనిరుద్.


100 రోజులు ముందే హైప్

అనిరుద్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుందంటే ఆ సినిమా మీద అంచనాలు పెంచడానికి తన వంతు కృషి చేస్తూనే ఉంటాడు. ముఖ్యంగా అజ్ఞాతవాసి సినిమాకు కూడా ఒక స్పెషల్ సాంగ్ వీడియో చేశాడు. ఇక తమిళ్ సినిమాలకు సంబంధించి కన్సర్ట్ ఇలా తను కంపోజ్ చేసిన పాటలను పాడుతూ ఉంటాడు. ఇక లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వస్తున్న కూలి సినిమా 100 రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఒక వీడియోను రెడీ చేశాడు లోకేష్. కేవలం రజనీకాంత్ ను మాత్రమే చూపించి ఈ సినిమాలో ఉన్న పెద్ద పెద్ద నటులు అందర్నీ వెనకనుంచి చూపించాడు. వీటన్నిటికీ కూడా అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సినిమా రిలీజ్ కి వంద రోజులు ముందే ఇలా హైప్ క్రియేట్ చేశాడు అనిరుద్.

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×