Sree Vishnu: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా సింగిల్. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకోవడంలో శ్రీ విష్ణు ముందుంటారు.మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి సింగిల్ తో రెడీ అయిపోయారు కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతుంది. శ్రీవిష్ణు సహజసిద్ధమైనహాస్యంతో నటన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ మూవీ రూపొందించబడింది.మే 9నఈచిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.మూవీ టీం ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. అందులో భాగంగా శ్రీవిష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
అంతా అల్లు అర్జున్ సపోర్ట్‌తోనే..
కార్తీక్ రాజు దర్శకత్వంలో విద్యా కోపినీడు, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, నిర్మాతలుగా సింగిల్ సినిమాను రూపొందించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ మూవీ రానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీవిష్ణు ను మీకు ఎవరైనా ఇండస్ట్రీలో16 సంవత్సరాలలో సపోర్ట్ చేసే హీరో ఉన్నారా అని అడగ్గా శ్రీ విష్ణు మాట్లాడుతూ.. నాకు అంత సపోర్ట్ ఇచ్చేవారు నా ఫ్రెండ్స్ తర్వాత మీరన్నట్లు హీరో ఎవరైనా అంటే మొదట చెప్పాల్సింది బన్నీ గారు. 2012లో ప్రేమ ఇష్క్ కాదల్ మూవీ టైంలో, చాలా చిన్న సినిమా నాది అప్పుడు, ఆ మూవీ వేణుగోపాల్ గారు ప్రొడ్యూసర్. ఆ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. ఆ టైంలో బన్నీ గారు ఫోన్ చేసి నీకు చాలా టాలెంట్ ఉంది మంచి యాక్టర్ అవుతావు. డిఫరెంట్ సినిమాల మీద ఫోకస్ చెయ్యి ఏది పడితే చేయొద్దు నీకు ఏదైనా కావాలంటే నీ వెనక నేనున్నాను. నీకు పర్సనల్ గా ఏదైనా సపోర్ట్ కావాలంటే ,పర్సనల్గా ఏదైనా స్టోరీ నచ్చితే ప్రొడ్యూస్ చేయడానికి నేను ముందుంటాను. ఆ టైంలోనే నా మూవీ గీత ఆర్ట్స్ బ్యానర్ పై చేస్తానని చెప్పారు. కాకపోతే నేనే ఏదైనా చేసి నా అంతటి నేను ప్రూవ్ చేసుకున్నాక గీత ఆర్ట్స్ లో సినిమా తీయాలని అనుకున్నాను అప్పుడు వద్దని అడగకుండా ఉన్నాను. ఆ తర్వాత చాలా సార్లు వేరే సినిమాలు చేయాలనుకున్నా అవి కుదరలేదు. ఎప్పుడు రావాలంటే వచ్చినప్పుడు వస్తుందంటారు కదా అలా నాకు ఈ టైంలో ఈ మూవీ బన్నీ గారు ప్రొడక్షన్ హౌస్ లో సింగిల్ మూవీ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇది నిజంగా చాలా ఎక్సైట్మెంట్. నాకు నాకు బన్నీ గారికి ఉన్న అనుబంధం నేను ఈ బ్యానర్ లో బెస్ట్ మూవీ ఇస్తున్నాను. ఎంటర్టైన్మెంట్ జోనర్ లో వస్తున్న సినిమా గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని తెలిపారు.
కన్నప్ప టీమ్ కు సారీ..
ఇక శ్రీవిష్ణు కన్నప్ప టీమ్ కు మీరు సారీ చెప్పారు దాని గురించి మీరేమనుకుంటున్నారు అని యాంకర్ అడగ్గా.. ఇలాంటివన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి.సినిమా అన్న తర్వాత చిన్నచిన్న విషయాలు పట్టించుకోకూడదు.ఇప్పటివరకు లేనిది ఇప్పుడు సారీ చెప్పడం గురించి నేనుఎక్కువ ఆలోచించట్లేదు ప్రశాంతంగా మనకుఇష్టమైన పనిని తీసుకెళ్లి పోతూ ఉండడమే, అని తెలిపారు.
Allu Arjun: అల్లు అర్జున్-అట్లీ మూవీలో మళ్లీ మార్పులు… మొత్తం తగలెట్టేలా ఉన్నారే…