E-Paper
Advertisement

Movies: థియేటర్, ఓటీటీలో ఈ వారం రిలీజ్ కానున్న చిత్రాలు ఇవే!

Movies: థియేటర్, ఓటీటీలో ఈ వారం రిలీజ్ కానున్న చిత్రాలు ఇవే!
Advertisement

Movies: ప్రతివారంలానే ఈవారం కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రెడీ అయ్యాయి. అయితే పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో చిన్న సినిమాలు థియేటర్‌లకు క్యూ కడుతున్నాయి. అలాగే ఓటీటీలో కూడా ప్రేక్షకులను అలరించేందుకు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి.

నేడే విడుదల

Advertisement

రామ్‌రెడ్డి పన్నాల దర్శకత్వంలో ఆసిఫ్ ఖాన్ హీరోగా వస్తున్న సినిమా నేడే విడుదల. మౌర్యాని ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీ మార్చి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సి.ఎస్.ఐ. సనాతన్

Advertisement

ఆది సాయికుమార్, మిషా నారంగ్ హీరోహీరోయిన్లుగా వస్తున్న తాజా చిత్రం ‘సి.ఎస్.ఐ. సనాతన్’. డైరెక్టర్ శివశంకర్ దేవ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ మార్చి 10న థియేటర్‌లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో ఆది సీఎస్ఐ అధికారికగా కనిపించనుండగా.. అలీ రెజా, వాసంతి, నందినిరాయ్, మధుసూధన్ ప్రధాన పాత్రలి నటిస్తున్నారు.

ట్యాక్సీ

డైరెక్టర్ హరీష్ సజ్జా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ట్యాక్సీ. హరిత సజ్జా నిర్మిస్తున్న ఈ మూవీలో అల్మాస్ మోటివాటా, వసంత్ సమీన్ పిన్నమరాజు, సూర్య శ్రీనివాస్, సౌమ్య మేనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీ కూడా మార్చి 10నే రిలీజ్ కానుంది.

వాడు ఎవడు

ఎన్. శ్రీనివాసరావు దర్శకత్వంలో కార్తికే, అఖిల నాయర్ జంటగా నటించిన చిత్రం వాడు ఎవడు. యాథార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ మూవీ మార్చి 10న విడుదల కానుంది.

ఓటీటీలో వచ్చే సినిమాలు వెబ్‌సిరీస్‌లు ఇవే..

రానా నాయుడు

విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా నటించిన వెబ్సిరీస్ ‘రానా నాయుడు’. మొదటిసారి వెబ్‌సిరీస్ ద్వారా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమాలో వెంకటేష్, రానా తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారు. ఈ వెబ్‌సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 10న రిలీజ్ కానుంది.

రేఖ (మలయాళ చిత్రం) మార్చి 10-నెట్‌ఫ్లిక్స్‌

ద గ్లోరీ (వెబ్‌సిరీస్‌2) మార్చి 10-నెట్‌ఫ్లిక్స్‌

రన్‌ బేబీ రన్‌ (తమిళ /తెలుగు చిత్రం) మార్చి 10-డిస్నీ+హాట్‌స్టార్‌

హ్యాపీ ఫ్యామిలీ: కండీషన్స్‌ అప్లయ్‌ (హిందీ సిరీస్‌) మార్చి 10-అమెజాన్‌ ప్రైమ్‌

చాంగ్‌ కెన్‌ డంక్‌ (మూవీ) మార్చి 10-డిస్నీ+హాట్‌స్టార్‌

రామ్‌యో (కన్నడ) మార్చి 10-జీ5

బొమ్మై నాయగి (తమిళ్‌) మార్చి 10-జీ5

బౌడీ క్యాంటీన్‌ (బంగ్లా) మార్చి 10-జీ5

బ్యాడ్‌ ట్రిప్‌ (తెలుగు) మార్చి 10-సోనీ లివ్‌

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×