BigTV English

Theatre.. బలవంతంగా యాడ్స్ చూపిస్తున్న థియేటర్లు.. కోర్టు తీర్పుతోనైనా మారతారా?

Theatre.. బలవంతంగా యాడ్స్ చూపిస్తున్న థియేటర్లు.. కోర్టు తీర్పుతోనైనా మారతారా?

Theatre:చాలామంది ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తూ ఉంటారు.అయితే అలా సినిమాలు చూసే సమయంలో వచ్చే ప్రకటనలు చూస్తే కొంత మందికి బోరింగ్ గా అనిపిస్తుంది. అయితే ఆ రోజంతా సినిమా కోసమే టైం కేటాయించి ఉండే వాళ్ళకైతే ప్రకటనల వల్ల పోయేదేమీ లేదు. కానీ బిజీ షెడ్యూల్ ఉన్నవారికి మాత్రం ఈ ప్రకటనల వల్ల పెద్ద తలనొప్పి అని చెప్పుకోవచ్చు. అయితే థియేటర్లలో వేసే ప్రకటనలపై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు చూసి చాలామంది థియేటర్ యాజమాన్యాలు కూడా వణికిపోతున్నారు. మరి ఇంతకీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పు ఏంటో ఇప్పుడు చూద్దాం..


ప్రకటనల వల్ల తన సమయం వృధా అయ్యిందన్న ప్రేక్షకుడు..

ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకి వెళ్లిన ఒక బిజీ షెడ్యూల్ ఉన్న వ్యక్తి థియేటర్లో వచ్చిన ప్రకటనల కారణంగా తన 25 నిమిషాల టైం వేస్ట్ అయిందని కోర్టులో కేసు వేశారు. నేను సామ్ బహదూర్ సినిమా చూడడం కోసం వెళ్లాను. 4:05 నిమిషాలకు షో స్టార్ట్ అవుతుందని చెప్పారు.కానీ ప్రకటనలు వేసి 25 నిమిషాలు టైం వేస్ట్ చేసి 4:30 ని..కు సినిమా స్క్రీన్ మీద వేశారు. అలా 6:30 కు సినిమా అయిపోయింది.


సుప్రీంకోర్టులో కేస్ అప్పీల్..

కానీ అప్పటికే నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నేను ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి రెండు గంటలు సినిమాకి కేటాయించాను. కానీ థియేటర్లో వచ్చిన ప్రకటనల వల్ల నా 25 నిమిషాల సమయం వేస్ట్ అయింది. ఫలితంగా నాకు ఆ రోజు ఇచ్చిన అపాయింట్మెంట్స్ కి నేను వెళ్లలేకపోయాను. దీంతో నేను నష్టపోయాను. సమయాన్ని డబ్బుతో కొంటున్నారు అంటూ బెంగళూరుకు చెందిన 30 ఏళ్ల వ్యక్తి ఐనాక్స్, పివిఆర్,బుక్ మై షోల పై కోర్టులో కేసు వేశారు.. అయితే ఈయన వేసిన కేసు పై కోర్టు విచారణ జరిపి సంచలన తీర్పు ఇచ్చింది. ఫిర్యాదు దారుడి సమయాన్ని వృధా చేసినందుకుగానూ పివిఆర్(PVR) అలాగే ఐనాక్స్ లు 20,000 లు చెల్లించడంతోపాటు ఆయనకు మానసిక వేదన కలిగించినందుకు మరో 8 వేలు ఎక్స్ట్రా ఇవ్వాలని కోర్టు జరిమానా విధించింది.అంతేకాదు వినియోగదారుల సంక్షేమ నిధికి కూడా లక్ష రూపాయలు జమ చేయాల్సిందిగా కోర్టు ఆర్డర్ వేయడంతో పివిఆర్ ఐనాక్స్ (Inox)లకు షాక్ తగిలినట్టు అయింది. కానీ ఈ విషయంలో బుక్ మై షో తప్పించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుక్ మై షో (Book My Show) లో ప్రకటన స్క్రీనింగ్ టైం పై ఎలాంటి నియంత్రణ అనేది లేదు. దీంతో ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పు ఇచ్చింది.

పీవీఆర్, ఐనాక్స్ లకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.

అలాగే బిజీ షెడ్యూల్ లో ఉన్న వ్యక్తులు గంటలు గంటలు ప్రకటనల కోసం వేచి చూసి సినిమాలు చూడరని ఇతరుల సమయాన్ని వృధా చేసి డబ్బులు సంపాదించడం సరైన పద్ధతి కాదు అంటూ కోర్టు తేల్చి చెప్పింది.అలా 2023లో కేసు వేసిన బెంగళూరుకు చెందిన అభిషేక్ (Abhishek) అనే 30 ఏళ్ల వ్యక్తి ఐనాక్స్, పివిఆర్ ల దగ్గర నుండి 28,000 డబ్బులు గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయం మీడియాలో వైరల్ అవ్వడంతో థియేటర్లలో నిమిషాల తరబడి యాడ్స్ ఇచ్చే వారికి పెద్ద షాక్ తగిలినట్టు అయింది అని కామెంట్ చేస్తున్నారు.

కోర్టు తీర్పుతోనైనా మార్పు వస్తుందా..?

సొంత లాభార్జన కోసం సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకుడి సమయాన్ని వృధా చేస్తున్నారు. రెండున్నర గంటల నిడివితో సినిమా రిలీజ్ చేస్తే.. ఈ యాడ్స్ కారణంగా మరో 30 నిమిషాల సమయం ప్రేక్షకుడికి వృధా అవుతోంది. దీనివల్ల వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయంలో సినిమా చూడడానికి వస్తే.. థియేటర్ యాజమాన్యాలు మాత్రం సొంత లాభార్జన కోసం ఇలా చేయడం ఏమాత్రం సమంజసం కాదు.. మరి కోర్టు తీర్పుతోనైనా థియేటర్ యాజమాన్యంలో మార్పు వస్తుందేమో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×