BigTV English

Kumari Aunty: సీఎం రేవంత్ రెడ్డిని పూజిస్తున్న కుమారీ ఆంటీ.. ఇంటిలోని దేవుడి గుడిలో..

Kumari Aunty: సీఎం రేవంత్ రెడ్డిని పూజిస్తున్న కుమారీ ఆంటీ.. ఇంటిలోని దేవుడి గుడిలో..

Kumari Aunty: చేసిన సాయానికి గుర్తుగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను ఇంట్లో పెట్టికుని పూజిస్తుంది కుమారీ ఆంటీ.. గతంలో ఆమెకు హెల్ప్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకుని.. కృతజ్ఞతతో సీఎం రేవంత్ ఫోటోను తమ పూజా మందిరంలో పెట్టుకుని పూజలు నిర్వహిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.


కుమారీ ఆంటీ.. ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరేమే. హైదరాబాద్ లోని కారిడార్ ఐటీసీ కోహినూర్ జంక్షన్‌లో రోడ్డు ప్రక్కన చిన్న హోటల్ నడుపుకుంటూ, జీవనం సాగిస్తూ.. తక్కువ కాస్ట్‌తోనే రుచికరమైన భోజనాన్ని అందిస్తూ.. మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మీ బిల్లు మొత్తం వెయ్యి రూపాయలు.. రెండు లివర్లు ఎగస్ట్రా అనే డైలాగ్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన కుమారీ ఆంటీ.. తరువాత పెద్ద సెలబ్రెటీ అయింది. కుమారీ ఆంటీ ఫు‌డ్‌స్టాల్‌కు రద్దీ అనూహ్యంగా పెరిగింది. భోజనం చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి కుమారీ ఫుడ్ స్టాల్స్‌కు క్యూ కట్టారు.

అక్కడికి వచ్చిన వారు రోడ్డు పైనే వాహనాలు పార్క్ చేయడం, జనాలు గుమికూడడంతో ఆ లైన్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఇటీవల కూమారీ ఆంటీపై కేసు నమోదు చేశారు. ఫుడ్ స్టాల్ అక్కడి నుంచి తీసేయాలని నోటీసులు కూడా ఇచ్చింది. పోలీసుల చర్యతో కుమారీ ఆంటీకి అన్యాయం జరిగిందని, ఆమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయడం దారుణం అని సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ఖండించారు. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఆమెకు బాసటగా నిలిచారు.


కుమారీ ఫుడ్‌స్టాల్ అక్కడి నుంచి తీసేయాల్సిన అవసరం లేదని చెప్పారు. అమె ఫుడ్‌స్టాల్స్ మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను ఆదేశించారు. కుమారీపై పెట్టిన కేసు విషయాన్ని కూడా పునఃపరిశీలన చేయాలని డీజేపీని ఆదేశించారు. వ్యాపారం చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఎమ్ఏయూడీ అధికారులకు కూడా చెప్పారు. అంతే కాదు ఆమె స్టాల్‌ను సందర్శిస్తానని రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. సీఎం ట్వీ‌ట్‌తో ఆమె మరింత ఫేమస్ అయింది.

Also Read: ఆరు నెలల తర్వాత పార్టీ ఆఫీసుకు కేసీఆర్.. ఉప ఎన్నికలపై ఫోకస్

అదే క్రేజ్‌తో ఆమెను ఏపీలో రాజకీయ పార్టీలో కూడా ప్రచారంలోకి దించారు. ఆ తర్వాత టీవీ షోలకు, సీరియల్స్ కూడా అవకాశాలు దక్కాయి. మూవీస్ వాళ్లు సైతం ప్రమోషన్ కోసం ఆమె షాపుకు ఎగబడ్డారు. ఇలా తన ఎదుగుదలకు కారణమైన రేవంత్ రెడ్డి మేలును కుమారీ ఆంటీ గుండెల్లో పెట్టుకుని దేవుడిలా కొలుస్తుంది. ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చెయ్యకపోతే.. పరిస్థితి వేరేలా ఉండేది. కుమారీ ఆంటీ షాపు అక్కడి నుంచి తీసేసేవాళ్లు. మళ్లీ కొత్త చోటుకు వెళ్లి వ్యాపారం మొదలుపెట్టుకోవాల్సి వచ్చేది. ఇంత డిమాండ్ వస్తుందో రాదో కూడా తెలీదు. అందుకే రేవంత్ రెడ్డి ఫోటోను దేవుడి గుడిలో దేవుళ్లు పక్కన పెట్టి మరీ కొలుస్తుంది.

 

Related News

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Big Stories

×