BigTV English

Akhanda 2 : బాలయ్య కోసం రంగంలోకి ‘కేజీఎఫ్’ విలన్… బోయపాటి ప్లాన్ మామూలుగా లేదుగా

Akhanda 2 : బాలయ్య కోసం రంగంలోకి ‘కేజీఎఫ్’ విలన్… బోయపాటి ప్లాన్ మామూలుగా లేదుగా

Akhanda 2 : ‘అఖండ’ (Akhanda) మూవీతో సూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఆ మూవీ ఇచ్చిన జోష్ తో వరుసగా సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా మోస్ట్ అవైటింగ్ సీక్వెల్ ‘అఖండ 2’ (Akhanda 2)ను సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే సినిమాలో విలన్ గా నటిస్తున్న యాక్టర్స్ అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో బాలయ్యతో ‘కేజీఎఫ్ 2’ విలన్ ఢీ కొట్టబోతున్నాడు అనే వార్త బాలయ్య ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.


బాలయ్య కోసం రంగంలోకి ‘కేజీఎఫ్ 2’ విలన్
ఈ ఏడాది ‘డాకు మహారాజ్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలయ్య. ఈ మూవీ హిట్ తరువాత ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమా షూటింగ్ లో ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామా 2025 దసరాకు విడుదల కానుందని ప్రకటించారు. ఇందులో మెయిన్ విలన్ గురించి గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మెయిన్ విలన్ పాత్ర కోసం ఇప్పటికే ఆది పినిశెట్టి (Aadhi Pinisetty)ని తీసుకున్నారని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ ను మెయిన్ విలన్ పాత్ర కోసం సంప్రదించారని టాక్ నడుస్తోంది. ఆయన కూడా పాజిటివ్ గా స్పందించారని సమాచారం. ‘అఖండ 2’లో పలువురు కొత్త నటీనటులు పవర్ ఫుల్ రోల్స్ పోషించబోతున్నారని తెలుస్తోంది. ‘అఖండ 2’లో సంజయ్ దత్ తో పాటు ఆది కూడా క్రేజీ రోల్ చేస్తున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ నుంచి అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇందులో సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, ప్రగ్యా జైస్వాల్ మరో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తుండగా, థమన్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.


సౌత్ లో సంజయ్ దత్ బిజీ
‘కేజీఎఫ్ 2’తో సంజయ్ దత్ (Sanjay Dutt) పవర్ ఫుల్ విలన్ గా నటించారు. రామ్ నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలో సంజయ్ దత్ విలన్‌ గా నటించారు. ఆ చిత్రం పరాజయం పాలైంది. కానీ సంజయ్ దత్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ‘అఖండ 2’ హిందీలో కూడా రిలీజ్ కాబోతోంది కాబట్టి ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ప్రత్యేకం కాబోతోంది.

థమన్ కు బాలయ్య కాస్ట్లీ గిఫ్ట్ 

బాలయ్య – బోయపాటి కాంబినేషన్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో, ఆయన సినిమాలకు థమన్ కొట్టే మ్యూజిక్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. థమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో బాలయ్య సినిమా అంటే బాక్స్ లు బద్దలు కావాల్సిందే. థమన్ – బాలయ్య బాండింగ్ కూడా రోజురోజుకూ స్ట్రాంగ్ అవుతోంది. రీసెంట్ గా థమన్ కు బాలయ్య కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×