BigTV English

Sobhan Babu: శోభన్ బాబుకు అమ్మాయిల పిచ్చా.. అన్ని ఎఫైర్లు నడిపాడా.. ?

Sobhan Babu: శోభన్ బాబుకు అమ్మాయిల పిచ్చా.. అన్ని ఎఫైర్లు నడిపాడా.. ?

Sobhan Babu: ఆంధ్రుల అందగాడు.. సోగ్గాడు శోభన్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి అగ్ర హీరోలు ఏలుతున్న ఇండస్ట్రీలోకి శోభన్ బాబు ఎంట్రీ ఇచ్చి.. వారితో సమానమైన హోదాను సంపాదించుకున్నాడు. టాలీవుడ్ సీనియర్ హీరోలు అనగానే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తరువాత శోభన్ బాబు పేరే వినిపిస్తుంది.


అందం, అభినయం అని సాధారణంగా హీరోయిన్లను పొగిడేటప్పుడు మాట్లాడతాం. కానీ, శోభన్ బాబు విషయంలో ఆ పదాలు వాడడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అప్పట్లోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే అగ్రకథానాయకుడిగా ఎదిగి మిగతా హీరోలకు షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈయనకు ఉన్నంతగా ఇంకెవరికి లేదు.. ఇకపై ఎవరికీ రాదు కూడా.

అప్పట్లో శోభన్ బాబు సినిమాలు థియేటర్స్‌లో రిలీజైతే.. ఆడవాళ్లు జాతర జరిగేది.ఇక శోభన్ బాబుకు అందమే ఆయన రింగు. అది లేకపోతే శోభన్ బాబును గుర్తుపట్టలేరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అప్పట్లో ఈయన అందానికి హీరోయిన్స్ సైతం మైమరిచిపోయేవారట. ఇక శోభన్ బాబు సినిమాల విషయం పక్కన పెడితే.. అప్పట్లో ఈ హీరోకు ఎఫైర్స్ ఎక్కువ అని టాలీవుడ్ కోడై కూస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు.


జయలలితతో సహా శోభన్ బాబు చాలామంది అమ్మాయిలతో ఎఫైర్స్ పెట్టుకున్నాడని వార్తలు కూడా వచ్చాయి. ముఖ్యంగా జయలలితను.. శోభన్ బాబు పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం అందరికి తెల్సిందే. డాక్టర్ బాబు అనే సినిమా ద్వారా వీరి పరిచయం ఏర్పడింది. ఎవరితో ఎక్కువ మాట్లాడని జయలలిత.. శోభన్ బాబుతో మాత్రం గంటలు గంటలు మాట్లాడేదట. అదే సమయంలో ఆమె తల్లి చనిపోవడంతో ఒంటరిగా మారిన జయలలితను శోభన్ బాబే ఓదార్చేవాడట.

అలా వారిద్దరి మధ్య స్నేహం.. ప్రేమగా మారిందని, వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. అప్పటికే శోభన్ బాబుకు శాంతి కుమారి తో వివాహమవ్వడం వలన ఆయన నో చెప్పాడని కొందరు.. తమిళ్ హీరో ఎంజీఆర్ వలన ఆ పెళ్లి ఆగిపోయిందని మరికొందరు చెప్పుకొస్తారు. ఆ తరువాత వీరిద్దరూ ఎన్నో ఏళ్ళు కలిసే ఉన్నారని, వీరికి పిల్లలు కూడా ఉన్నారని టాక్. రియల్ లైఫ్ లోనూ శోభన్ బాబును చాలా మంది హీరోయిన్స్ ఇష్టపడేవారని సమాచారం. వారు కూడా ఆయన అందానికి ముగ్దులైపోయేవారట.

ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని చాలామంది ప్రముఖులు ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. జయలలితను.. శోభన్ బాబు ప్రేమించడం వాస్తవమే కానీ, వారి పెళ్లి వారి వ్యక్తిగతం. కొన్ని కారణాలు వారిని ఆపేశాయి. కానీ, వారికి పిల్లలు ఉన్నారు అన్నది మాత్రం అబద్ధమని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇక శోభన్ బాబుకు ఎప్పుడు ఆస్తులు, బిజినెస్ అనే లోకం తప్ప వేరేది ఏది ఉండేది కాదని, అమ్మాయిల పిచ్చి అనేది కూడా అబద్దమే అని మరికొందరు చెప్పుకొస్తున్నారు.

ఏదిఏమైనా శోభన్ బాబుకు ఎఫైర్స్ ఉన్నాయా లేదా.. ? అనేది ఇప్పటీకే మిస్టరీగానే మిగిలిపోయింది. ఇవన్నీ పక్కన పెడితే.. శోభన్ బాబు ఇండస్ట్రీలో ఒక రేర్ నటుడు. తాను బతికి ఉన్నప్పుడే తన కుటుంబాన్ని సెటిల్ చేసి, తన పిల్లలు ఈ ఇండస్ట్రీలోకి రాకుండా చేయగలిగాడు. అప్పటి స్టార్ హీరోస్ మళ్లీ రీఎంట్రీ ఇస్తున్న సమయంలో కూడా తాను చేస్తే హీరోగానే చేస్తానని, వేరే పాత్రలో చేయడం తనకు ఇష్టం లేదని.. చనిపోయేంత వరకు కూడా హీరోగానే చేసిన నటుడు శోభన్ బాబు. ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేకపోయినా.. ఆయన సినిమాలతో ఎప్పుడు ప్రజల గుండెల్లో నిలిచే ఉంటాడు.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

×