BigTV English

Apple M4 MacBook : త్వరలోనే మరో ఆపిల్ ఈవెంట్.. మాక్ బుక్ ప్రో, మాక్ మినీ, ఐమాక్ లాంఛిగ్ ఎప్పడంటే!

Apple M4 MacBook : త్వరలోనే మరో ఆపిల్ ఈవెంట్.. మాక్ బుక్ ప్రో, మాక్ మినీ, ఐమాక్ లాంఛిగ్ ఎప్పడంటే!

Apple M4 MacBook : ఆపిల్ 2024 మెగా లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్‌లో జరిగింది. ఈ ఈవెంట్ లో iPhone 16 సిరీస్, Apple వాచ్ సిరీస్ 10, AirPods 4 ఆపిల్ లాంఛ్ చేసింది. ఇక తాజాగా MacBook M4 చిప్ మోడల్స్ లాంఛింగ్ కు ఆపిల్ సన్నాహాలు చేస్తుంది. అక్టోబర్ చివరలో MacBook Pro, Mac mini, iMac ను తీసుకురాననున్నట్లు తెలుస్తుంది.


అక్టోబర్ లాస్ట్ వీక్ లో ఆపిల్ మరో ఈవెంట్ ఉండొచ్చని బ్లూమ్‌బెర్గ్ మార్క్ గుర్మాన్ అంచనా వేశారు. ఆపిల్ నుంచి M4 మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్, Mac Mini, iMacతో పాటు కొత్త ఐప్యాడ్ మినీ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మరి కొన్నింటిని నవంబర్ ప్రారంభంలో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఇక M4 మ్యాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్స్, కొత్త ఐప్యాడ్స్, టాబ్లెట్స్, అప్‌గ్రేడ్ ఎయిర్‌ట్యాగ్స్  2025 ప్రారంభంగా అధికారికంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ఈ ఈవెంట్లో ఆపిల్ నుంచి మరిన్ని లేటెస్ట్ అప్డేటెడ్ గ్యాడ్జెట్స్ రాబోతున్నట్లు తెలుస్తుంది. 14 అంగుళాల మ్యాక్‌బుక్‌ను ప్రారంభించాలని ఆపిల్ సన్నాహాలు చేస్తుంది. M4 చిప్‌తో ప్రో మోడల్ (కోడ్ J604), హై-ఎండ్ 14 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌(J614), 16 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్ (J616) రానున్నట్లు తెలుస్తుంది.


M4 లేదా M4 ప్రో చిప్‌లతో (J773), లేటెస్ట్ వెర్షన్ లో  iMac M4 చిప్ (J623), అప్‌గ్రేడ్ ఐప్యాడ్ మినీ (J410) వెర్షన్ తో ఆపిల్ Mac మినీ ఎడిషన్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ALSO READ : ఇదెక్కడి డిజైన్ బాసూ.. మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ తో మరో కొత్త స్మార్ట్‌ ఫోన్!

2025 ఆపిల్ ఈవెంట్ – వచ్చే ఏడాది Apple M4 (J613,  J615) చిప్‌లతో 13 అంగుళాల, 15 అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్స్ లో మార్పులు చేయనుంది. వీట అప్డేట్ వెర్షన్ 11 అంగుళాల, 13 అంగుళాల ఐప్యాడ్ ఎయిర్ మోడల్‌లను (J607, J637)ను లాంఛ్ చేయనుంది. ఇక వీటి కోసం కొత్త మ్యాజిక్ కీబోర్డులను సైతం డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఐప్యాడ్ ఎయిర్ లైన్ (R307, R308)లతో పాటు అప్‌గ్రేడ్ వెర్షన్ తో AirTag (B589) రాబోతున్నట్లు టెక్ వర్గాలు ప్రాథమిక అంచనాకి వచ్చాయి. ఇక ఎప్పటినుంచే అందుబాటు ధరలో లాంఛ్ అయ్యే iPhone SE మెుబైల్ కోసం ఆపిల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. V59 కోడ్‌నేమ్‌తో రాబోతున్న ఈ మెుబైల్ 2025 ప్రథమార్థంలో అధికారికంగా లాంఛ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక Apple M4తో సమానమైన ఫీచర్స్ ఉన్న Mac Studio, Mac Pro మోడళ్లపై సైతం ఆపిల్ సన్నాహాలు చేస్తుందని గుర్మాన్ తెలిపారు. అయితే వీటికి మరింత సమయం పట్టొచ్చని చెప్పకొచ్చారు. Mac Studio ప్రారంభం వచ్చే ఏడాది ద్వితియార్థంలో జరిగితే Mac Proలో మరిన్ని వెర్షన్స్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది.  M5 Macsతో పాటు iPhone 17 సిరీస్ కూడా అప్పుడే వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇక వీటితో పాటు ఆపిల్ వాచెస్ లో లేటెస్ట్ వెర్షన్స్ సైతం వస్తాయని చెప్పుకొచ్చింది.

Related News

Google Pixel 9 vs Pixel 10: పిక్సెల్ 10 కంటే పిక్సిల్ 9 బెటర్.. ఎందుకంటే?

Grok Imagine AI: ఇప్పుడు ఏఐ వీడియో, ఇమేజ్‌‌లు చేయడం అంతా ఫ్రీ.. అందరికీ అందుబాటులో గ్రోక్ ఇమేజిన్

Lava Play Ultra 5G: కేవలం రూ.14999కే సూపర్ గేమింగ్ ఫోన్.. 64MP కెమెరా, భారీ బ్యాటరీతో లాంచ్

Google Pixel 10 Series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఇండియాలో విడుదల.. అద్భుత కెమెరా, పవర్ ఫుల్ ఏఐ ఫీచర్లు

Vivo V60: 50MP కెమెరా, పెద్ద బ్యాటరీ.. వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ పై భారీ డిస్కౌంట్

ChatGPT Free vs ChatGPT Go vs ChatGPT Plus: ఏ ప్లాన్ బెటర్.. మీరు ఏది ఎంచుకోవాలి?

Big Stories

×