Tollywood Heroines : పెళ్లిళ్లు అనేవి స్వర్గంలో నిర్ణయిస్తారని పెద్దలు అంటుంటారు.. అదేవిధంగా కళ్యాణం వచ్చిన కక్కు వచ్చిన ఆగదని కళ్యాణ ఘడియలు వస్తే కచ్చితంగా దేవుడు నిర్ణయించిన జోడితోనే పెళ్లి జరుగుతుందని అంటారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే మంచిదని అంటూ ఉంటారు.. సాధారణ ప్రజలు అయితే పెళ్లి విషయంలో కాస్త ముందుగానే ఆలోచించినా ఇండస్ట్రీలో ఉండేవారు మాత్రం నాలుగు పదుల వయసు వచ్చినా పెళ్లి విషయం ఆలోచించరు.. సినిమాల వల్ల బిజీగా ఉండటం వల్ల పెళ్లిని పక్కనపెట్టేస్తారు. అయితే లేటు వయసులో అయినా కూడా రహస్యంగా పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సావిత్రి..
మహానటి సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో బిజీగా ఉంటూనే తన కోఆర్టిస్ట్ అయినా గణేషన్ పెళ్లి చేసుకుంది. ఆయనకు ఆల్రెడీ పెళ్లయింది. మళ్లీ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి ఆమె జీవితాన్ని కృంగేలా చేసింది. చివరి రోజులో ఎన్నో బాధలు అనుభవించి చనిపోయారు..
జయప్రద..
టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లలో జయప్రద కూడా ఒకరు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ నహతాని ఆమె వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆయనకు పెళ్లయి, పిల్లలు ఉండడంతో తమ వివాహ విషయాన్ని బయటకు చెప్పలేదు.
శ్రీదేవి..
అతిలోకసుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే.. బోనీకపూర్ ను రెండో పెళ్లి చేసుకుంది. అంతకుముందు ఆమె మిధున చక్రవర్తిని పెళ్లి చేసుకొని దూరమయ్యారు.. శ్రీదేవి, బోనీకపూర్ దంపతులకు ఇద్దరు పిల్లలు.
దేవయాని..
హీరోయిన్ దేవయాని, రాజకుమార్ అనే దర్శకుడితో ప్రేమలో పడ్డారు. అయితే ఈ విషయం ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ ఆమె ప్రయత్నం ఫలించలేదు. దీంతో కోరుకున్న వ్యక్తి కోసం కుటుంబ సభ్యుల మాటను కాదనలేక ఇంట్లోంచి పారిపోయి సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది..
శ్రియ శరన్..
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రియ శరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో నటించి మెప్పించింది. ఈ అమ్మడు సడన్ గా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చింది. ఒక విదేశీయుడ్ని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయింది.
Also Read :‘బ్రహ్మముడి’ కావ్య జీవితంలో అన్నీ కష్టాలే.. వింటే కన్నీళ్లు ఆగవు..
రమ్యకృష్ణ..
రమ్యకృష్ణ పేరుకి పరిచయాల అవసరం లేదు. అందం అభినయంతో ఎన్నో హిట్ సినిమాలో నటించి ప్రేక్షకులు మనసు దోచుకుంది. ఇప్పటికీ సినిమాల్లో బిజీగా నటిస్తూ వస్తుంది. ఈమె ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది..
ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోయిన్లు ఈ లిస్టులోకి వస్తారు. కొందరు సడన్గా పెళ్లి చేసుకుని షాక్ ఇస్తే.. కొందరు ఈ పెళ్లిని పెటాకులు చేసుకొని షాక్ ఇచ్చారు.. ఇక వీరందరూ కూడా సినిమాల్లో బిజీగా ఉన్నారు. శ్రియ శరన్ ఇప్పటికీ హీరోయిన్గా నటిస్తూ క్రేజ్ ని పెంచుకుంటుంది..