Brahmamudi Kavya : స్టార్ మా చానల్లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్లలో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ ప్రేక్షకుల ఆదరాభిమానాన్ని సొంతం చేసుకుంది. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం స్థానంలో ప్రసారం అవుతున్న ఈ ధారవాహిక అదే రేంజ్‌లో రేటింగ్‌ను సొంతం చేసుకొంటున్నది. అయితే ఈ సీరియల్‌లో కావ్య పాత్రతో తనదైన నటనతో ఆకట్టుకుంది తమిళ నటి దీపికా రంగరాజు. ఈ సీరియల్ తో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఈ మధ్య వరుసగా షోలలో కనిపిస్తూ సందడి చేస్తుంది. ఈ సీరియల్ తో దీపిక రేంజ్ ఎక్కడికో వెళ్ళింది.. ఈమధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో మెరుస్తూ అందరిని నవ్విస్తూ ఆకట్టుకుంటుంది. బయట ఎప్పుడూ నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ కనిపించే కావ్య జీవితంలో అన్నీ కష్టాలే అని తెలుస్తుంది. కన్నీళ్లు తెప్పిస్తున్న ఆమె కష్టాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
దీపిక పర్సనల్ లైఫ్..
దీపికా రంగరాజు ఒక తమిళ అమ్మాయి. తమిళంలో వరసగా సీరియస్ చేస్తూ పాపులార్టీని సొంతం చేసుకున్న ఈ అమ్మడు తెలుగులో బ్రహ్మముడి సీరియల్ తో ప్రేక్షకులకు పరిచయమైంది.. కేవలం సీరియల్స్ మాత్రమే కాదు తమిళంలో ఓ సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం సీరియల్స్ లతో బిజీగా ఉంది దీపికా రంగరాజు.. తమిళ, తెలుగు రంగంలో రాణిస్తున్న దీపిక రంగరాజు.. తమిళంలో ఓ సినిమా లో కూడా నటించింది. ఆరాడీ అనే చిత్రం ద్వారా సినిమా రంగంలో కి ప్రవేశించింది.. సినిమాల్లో మంచి పాత్రలు వస్తే నటిస్తానని చెబుతుంది..
Also Read :ఆ హీరోయిన్ తో స్టార్ హీరో ఎఫైర్.. నన్ను దారుణంగా మోసం చేశాడు..
కన్నీళ్లు తెప్పిస్తున్న రియల్ స్టోరీ..
బుల్లి తెరపై పలు షోలలో మెరుస్తూ తన అల్లరితో ప్రేక్షకులకు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఏ షోలో దీపిక కనిపిస్తే ఆ షోలో రచ్చ మాములుగా ఉండదు. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా గలగల అంటూ మాట్లాడే ఈమె జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొందని వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఆహాలో ప్రసారమవుతున్న కాకమ్మ కథలు షోలో దీపిక మాట్లాడుతూ.. మనం ఏ పని చేసినా వెన్ను తట్టి ప్రోత్సహించేవాళ్లుండాలి. ముఖ్యంగా అమ్మానాన్న మన వెనకాల నిలబడాలి. స్నేహితులు, దగ్గరివాళ్లు.. ఇలా ఎవరో ఒకరు మోటివేట్ చేసేవాళ్లుండాలి. అలా నాకంటూ ఎవరూ లేరు.. యాక్టింగ్ మానేసి ఇంట్లో కూర్చుని చదువుకో, ఐటి జాబ్ చెయ్ లేదా గవర్నమెంట్ జాబ్ చెయ్ అని అనేవాళ్ళు తప్ప నువ్వు మంచిగా సీరియల్స్ చేస్తున్నావని ఎంకరేజ్ చేసే వాళ్ళే లేరు అంటూ దీపిక కన్నీళ్లు పెట్టుకుంది.. ప్రోత్సహిస్తే నేను ఏదైనా చేయగలుగుతాను. ఇంకా ఎదుగుతాను. కానీ ఇప్పుడు నాకు నేనే మోటివేషన్ ఇచ్చుకోవాలి. కొన్నిసార్లు అది బోర్ కొడుతుంది.. ఈ పరిస్థితులన్నీ చూస్తే నేను యాక్టింగ్ మానేసి జాబ్ చెయ్యాలని అనుకుంటాను. ఏమో చెప్పలేను త్వరలోనే యాక్టింగ్ కి గుడ్ బై చెప్పి జాబ్ సెర్చింగ్ మొదలు పెడతారేమో అని దీపిక తన మనసులోని మాటలని, బాధని బయటికి చెప్పింది.. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.