Brahmamudi serial today Episode: హల్లోకి వచ్చి అందరూ ఒకరిని ఒకరు తిట్టుకుంటుంటే అపర్ణ, అప్పు మాత్రం వెళ్లిపోయారా హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటారు. ఇంతలో రుద్రాణి ఎవరు వెళ్లిపోయారు అని అడుగుతుంది. దీంతో అప్పు ఇందాక అక్క ఇక్కడే ఉండేది కదా వెళ్లిపోయిందా అని చెప్పగానే.. రుద్రాణి అనుమానంగా చూస్తుంది. ఇంతలో ఇందిరాదేవి అసలు మీరెందుకు అంత కంగారు పడుతున్నారు అని అడుగుతుంది. కంగారెందుకు అత్తయ్యా అసలు ఎవరిని చూసి కంగారు పడాలి. ఇందాకటి నుంచి హాల్లో కూర్చోవాలి అని తెగ గొడవ చేశారు కదా ఇప్పుడు కావాల్సినంత సేపు కూర్చోండి అని అపర్ణ చెప్తూ.. నా కొడుకు కోడలు ఎక్కడే ఇప్పటి వరకు హల్లోనే ఉన్నాము అని చెప్పారు కదా..? అని మెల్లగా అప్పును అడుగుతుంది. దీంతో అప్పు నేను కూడా అక్కడి వరకే విన్నాను ఆంటీ.. తర్వాత వీళ్లంతా గొడవ చేస్తూ బయటకు వచ్చేసరికి కనిపించలేదు అంటుంది.
దీంతో అపర్ణ ఒకవేళ బయట ఏమైనా ఉన్నారా చూద్దాం పదండి అంటూ ఇద్దరూ కలిసి బయటకు వెళ్తారు. ఇద్దరినీ అనుమానంగా చూసిన రుద్రాణి ఇప్పటి వరకు వదిన కావ్య కలిసి ఏదో గూడుపుఠాణి చేస్తున్నారు అనుకున్నాను.. సడెన్ గా ఇప్పుడు మా వదిన అప్పు వెనక తిరుగుతుందేంటి..? అని రాహుల్ ను అడుగుతుంది. దీంతో రాహుల్ నాకు అదే అనుమానంగా ఉంది మమ్మీ.. ఎప్పుడూ లేనిది అప్పు మన గదిలోకి తీసుకెళ్లి మరీ రాజ్ గురించి చెప్తాను అంది. ఎందుకంటావు అంటాడు. దీంతో రుద్రాణి కోపంగా వెళ్లి ఆ పొట్టి దాన్ని అడుగుతు అని చెప్తుంది. రాహుల్ వద్దులే అంటాడు. బయట కావ్య డోర్ వేయగానే.. రాజ్ వెళ్లిపోతుంటే.. సుభాష్ వస్తాడు. రాజ్‌ను చూసి సుభాష్ షాకింగ్ గా నిలబడిపోతాడు.
వైదేహి వాళ్లు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటుంటే.. యామిని వస్తుంది. మమ్మీ బావ వచ్చారా..? ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. దీంతో వైదేహి ఇంకా రాలేదు బేబీ అని చెప్తుంది. దీంతో యామిని ఇంకా రాలేదా..? ఎప్పుడో వెళ్లాడుగా అని అడుగుతుంది. అవును నువ్వు ఉన్నప్పుడే వెళ్లాడుగా బేబీ అంటుంది వైదేహి. ఇంత సేపు ఇంటికి రాకుండా బయట ఏం చేస్తున్నాడు అంటుంది యామిని. ఏదో పనిలో ఉండి ఉంటాడులే అమ్మా అంటూ వాళ్ల డాడీ చెప్పగానే.. యామిని కోపంగా లేటవుతుందని నాతో ఒక్కమాట కూడా చెప్పలేదు. యాక్సిడెంట్ అయి గతం మర్చిపోయిన వ్యక్తి రాలేదని మీరైనా నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా..? తనకు ఏదైనా అయితే ఎవరు రెస్పాన్స్‌బిలిటీ అంటూ కోప్పడుతుంది. అయినా తను బయటకు వెళ్లినప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి తన కారులో జీపీఎస్ పెట్టావు కదా బేబీ అది ఓపెన్ చేసి చూడు అని చెప్తుంది. యామిని అవును ఈ టెన్షన్‌లో అది మర్చిపోయాను ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తాను అంటూ జీపీఎస్ ఓపెన్ చేసి చూసి అయిపోయింది ఇంక అంతా అయిపోయింది. రామ్ తన సొంత ఇంటికి వెళ్లాడు అంటూ కోప్పడుతుంది.
రాజ్ ను చూస్తూ నిలబడిపోయిన సుభాష్, రాజ్ అని పిలవబోతుంటే కావ్య అడ్డు పడుతుంది. మీరు కరెక్టుగా గెస్ చేశారు. నాకు ఈ మధ్యనే పరిచయం అయిన రామ్ ఇతనే అంటూ ఏదేదో చెప్తుంటే.. సుభాష్ కూడా హాయ్ రామ్ అంటాడు. తర్వాత రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత సుభాష్ కు అందరూ కలిసి నిజం చెప్తారు. కావ్య, అపర్ణ ఏడుస్తుంటారు. ఇప్పుడిప్పుడే గతం గుర్తుకు వస్తుంది. త్వరలోనే అంతా గుర్తుకు వస్తుంది. కావ్య చెప్పినట్టు కొన్ని రోజులు ఓపిక పడదాం అని అపర్ణ చెప్పగానే సుభాష్ సరే అంటాడు. రాజ్‌ను చూశాను. వాడు బతికే ఉన్నాడని తెలుసుకున్నాను. ఇంకొన్ని రోజులే కదా ఎదురుచూస్తాను. వాడు నవ్వుతూ వచ్చి నాన్నా అని పిలిచే వరకు ఆశగా ఎదురుచూస్తాను అని చెప్తాడు.
మరోవైపు యామిని కోపంగా నాకు రామ్ కావాలి వెళ్లి తీసుకురండి అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంది. ఇంతలో రాజ్ రావడం గమనించిన వైదేహి అదిగో రామ్ వచ్చాడు. అక్కడికి వెళ్లినా తిరిగి వచ్చాడంటే తనకు గతం గుర్తుకు రాలేదన్నమాట. నువ్వు కూల్ గా ఉండు బేబీ అని చెప్తుంది. ఇంతలో రాజ్ లోపలికి రాగానే యామిని పలకరిస్తుంది. ఎక్కడికి వెళ్లావు బావ అని అడుగుతుంది. దీంతో పనుండి వెళ్లాను మధ్యలో ఫ్రెండ్ కలిస్తే రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేస్తూ అక్కడే ఉండిపోయాను అంటూ లోపలికి వెళ్లిపోతాడు. రాజ్ లోపలికి వెళ్లిపోయాక వెంటనే పెళ్లి చేసుకోవాలి అని యామిని అంటుంది. దీంతో వాళ్ల డాడీ నువ్వు తప్పు చేస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించు బేబీ అంటూ చెప్పబోతుంటే యామిని కోపంగా తిడుతుంది. మీకు ఇంతకుముందే చెప్పాను మీరు ఇలా అడ్డుపడితే ఏం చేస్తానో అని బెదిరిస్తుంది. రేపు వెడ్డింగ్ కార్డ్ పనులన్నీ బావతోనే చేయిస్తాను అని చెప్తుంది.
కావ్య రాజ్ ఇచ్చిన శారీ కట్టుకుని రాజ్ ఫోటో ముందు నిలబడి మాట్లాడుతుంది. ఫోటో దగ్గరకు తీసుకుని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది. ఇంతలో రాజ్ ఫోన్ చేస్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?